Sunday, September 8, 2024
Homeస్పోర్ట్స్వరల్డ్ అథ్లెటిక్ ఛాంపియన్ షిప్: నీరజ్ కు రజతం

వరల్డ్ అథ్లెటిక్ ఛాంపియన్ షిప్: నీరజ్ కు రజతం

అమెరికా లోని యూజీన్ లో జరుగుతోన్న వరల్డ్ అథ్లెటిక్ ఛాంపియన్ షిప్, పురుషుల జావెలిన్ త్రో లో భారత స్టార్ నీరజ్ చోప్రా కు రజత పతకం లభించింది. నేడు జరిగిన ఫైనల్లో తన నాలుగవ ప్రయత్నంలో 88.13  మీటర్లు విసిరిన నీరజ్ రజతం ఖాయం చేసుకున్నారు. టోక్యోలో జరిగిన ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ గెల్చుకొని అదే స్ఫూర్తి తో ఈ మెగా ఈవెంట్ లో కూడా గోల్డ్ మెడల్ సాధించి సరికొత్త చరిత్ర రాయాలనుకున్నాడు. కానీ ఆ అవకాశం త్రుటిలో చేజారింది. మొదటి ప్రయత్నంలో ఫౌల్ కాగా, రెండు, మూడు ప్రయత్నాల్లో 82.39, 86.37 మీటర్ల పాటు విసిరాడు. చివరి రెండు ప్రయత్నాల్లో కూడా ఫౌల్ కావడంతో రజతంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇదే ఈవెంట్ లో ఫైనల్స్ కు చేరుకున్న మరో భారత ఆటగాడు రోహిత్ 10వ స్థానంలో నిలిచాడు.  గ్రెనెడా దేశానికి చెందిన క్రీడాకారుడు అండర్సన్ పీటర్స్ 90.54 మీటర్లు విసిరి గోల్డ్ మెడల్ దక్కించుకున్నాడు

రెండో స్థానంలో నిలిచిన నీరజ్ చోప్రా వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ లో ఈ ఘనత సాధించిన తొలి భారత క్రీడాకారుడిగా చరిత్ర సృష్టించాడు.  ఇంతకుముందు అంజూ బాబీ జార్జ్ 2003, పారిస్ లో జరిగిన పోటీల్లో లాంగ్ జంప్ విభాగంలో కాంస్య  పతకం సాధించింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్