Saturday, January 18, 2025
Homeసినిమావిడుదల సన్నాహాల్లో 'నేనెవరు'

విడుదల సన్నాహాల్లో ‘నేనెవరు’

కౌశల్ క్రియేషన్స్ పతాకంపై భీమినేని శివప్రసాద్, తన్నీరు రాంబాబు నిర్మాతలుగా, నిర్ణయ్ పల్నాటి దర్శకత్వం వహించిన చిత్రం ‘నేనెవరు‘. పూనమ్ చంద్-కుమావత్-కిరణ్ కుమార్ మోటూరి సహ నిర్మాతలు. ప్రముఖ ఎడిటర్ స్వర్గీయ కోలా భాస్కర్ తనయుడు కోలా బాలకృష్ణ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో సాక్షి చౌదరి హీరోయిన్ కాగా.. తనిష్క్ రాజన్, గీత్ షా సహాయ పాత్రల్లో, బాహుబలి ప్రభాకర్ విలన్ గా నటిస్తున్నారు. రాధ గోపి తనయుడు ఆర్.జి.సారథి ఈ చిత్రం ద్వారా సంగీత దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.

సెన్సార్ సహా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ‘నేనెవరు’ అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సన్నాహాలు చేసుకుంటోంది. లవ్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచుతుందని దర్శకుడు నిర్ణయ్ పల్నాటి తెలిపారు.  ఈ చిత్రంలో రాజా రవీంద్ర, దిల్ రమేష్, డి.ఎస్.రావు తాగుబోతు రమేష్, వేణు, సుదర్శన్ రెడ్డి, నీరజ ఇతర ముఖ్య పాత్రలు పోషించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్