Monday, April 15, 2024
Homeసినిమా'నేనెవరు' ఒక స్పెషల్ జోనర్ ఫిల్మ్

‘నేనెవరు’ ఒక స్పెషల్ జోనర్ ఫిల్మ్

లవ్ – సస్పెన్స్ అండ్ క్రైమ్ థ్రిల్లర్స్ మెచ్చేవారందరికీ నచ్చే చిత్రం డైరెక్టర్ నిర్ణయ్ పల్నాటి

రొటీన్ సినిమాలకు భిన్నంగా రూపొందిన ‘నేనెవరు‘ ఒక స్పెషల్ జోనర్ ఫిల్మ్ అంటున్నాడు యువ దర్శకుడు నిర్ణయ్ పల్నాటి. లవ్, సస్పెన్స్ అండ్ క్రైమ్ థ్రిల్లర్స్ ఇష్టపడేవాళ్ళందరూ నేనెవరు చిత్రంతో కచ్చితంగా కనెక్ట్ అవుతారని, ఈ చిత్రం ఇంత అద్భుతంగా రావడం కోసం నిర్మాతలు భీమినేని శివప్రసాద్ – తన్నీరు రాంబాబు ఎంతో శ్రద్ధ తీసుకున్నారని, ప్రతి ఫ్రేమును ప్రత్యేక శ్రద్ధతో తీర్చిదిద్దామని తెలిపాడు. హీరో కోలా బాలకృష్ణ కెరీర్ కి ఈ చిత్రం టర్నింగ్ పాయింట్ అవుతుందనే నమ్మకం వ్యక్తం చేశాడు. కోలా భాస్కర్ ఎడిటింగ్, ఆర్.జి.సారథి సంగీతం ఈ చిత్రానికి ముఖ్య ఆకర్షణలని యువ ప్రతిభాశాలి పల్నాటి తెలిపాడు.

నిర్ణయ్ పల్నాటి దర్శకత్వంలో కౌశల్ క్రియేషన్స్ పతాకంపై భీమినేని శివప్రసాద్-తన్నీరు రాంబాబు సంయుక్తంగా నిర్మించిన ‘నేనెవరు” డిసెంబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. లవ్ – సస్పెన్స్ అండ్ క్రైమ్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్రానికి పూనమ్ చంద్-కుమావత్-కిరణ్ కుమార్ మోటూరి సహ నిర్మాతలు. తనిష్క్ రాజన్, గీత్ షా, బాహుబలి ప్రభాకర్ ఇతర ముఖ్య పాత్రదారులు.
రాజా రవీంద్ర, దిల్ రమేష్, డి.ఎస్.రావు తాగుబోతు రమేష్, వేణు, సుదర్శన్ రెడ్డి, నీరజ ఇతర ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి కెమెరా: సామల భాస్కర్, ఫైట్స్: రియల్ సతీష్, కొరియోగ్రఫీ: చంద్రకిరణ్.జె, పి.ఆర్.ఓ: ధీరజ్ – అప్పాజీ, పబ్లిసిటీ డిజైన్స్: వాల్స్ అండ్ ట్రెండ్స్, పోస్ట్ ప్రొడక్షన్: ప్రసాద్ లాబ్స్, ఎడిటింగ్: కోలా భాస్కర్, పాటలు: కృష్ణకాంత్, సంగీతం: ఆర్.జి.సారథి, సహనిర్మాతలు: పూనమ్ చంద్-కుమావత్-కిరణ్ కుమార్ మోటూరి, నిర్మాతలు: భీమినేని శివప్రసాద్-తన్నీరు రాంబాబు, దర్శకత్వం: నిర్ణయ్ పల్నాటి!!

Also Read :  ఈనెల 25న రానున్న లవ్ సస్పెన్స్ థ్రిల్లర్ నేనెవరు

RELATED ARTICLES

Most Popular

న్యూస్