Saturday, January 18, 2025
Homeస్పోర్ట్స్సౌతాఫ్రికాకు షాక్: నెదర్లాండ్స్ పై ఓటమి

సౌతాఫ్రికాకు షాక్: నెదర్లాండ్స్ పై ఓటమి

పురుషుల టి20 వరల్డ్ కప్ లో మరో సంచలన విజయం నమోదైంది. సెమీస్ బెర్త్ కోసం కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్ లో సౌతాఫ్రికా జట్టు అనూహ్యంగా ఓటమి పాలైంది. దీనితో పాకిస్తాన్-బంగ్లాదేశ్ మ్యాచ్ ఫలితంపై సౌతాఫ్రికా బెర్త్ ఆధారపడి ఉంటుంది.

ఈరోజు జరిగిన తొలి మ్యాచ్ లో నెదర్లాండ్స్ అందించిన 159 పరుగుల లక్ష్యాన్ని సాధించడంలో ప్రోటీస్ జట్టు విఫలమై 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 145 పరుగులు మాత్రమే చేయగలిగింది. 13 పరుగుల తేడాతో డచ్ జట్టు గెలిచింది.

అడిలైడ్ ఓవల్ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్ లో సౌతాఫ్రికా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. డచ్ జట్టులో ఆకేర్ మాన్ 26 బంతుల్లో 3ఫోర్లు, 2సిక్సర్లతో 41 (నాటౌట్); ఓపెనర్ మైబర్గ్-37; టామ్ కూపర్-35; మాక్స్ ఓదౌద్-29 పరుగులతో రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 158 పరుగులు చేసింది.

ప్రోటీస్ బౌలర్లలో కేశవ్ మహారాజ్ రెండు; నార్త్జ్, ఏడెన్ మార్ క్రమ్ చెరో వికెట్ పడగొట్టారు.

లక్ష్య ఛేదనలో సౌతాఫ్రికా తడబడింది. ఓ చక్కని భాగస్వామ్యం నమోదు చేయడంలో విఫలమైంది. రీలీ రోస్సో 25 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. హీన్రిచ్ క్లాసేన్ 21; కెప్టెన్ బావుమా-20 పరుగులు చేశారు.

నెదర్లాండ్స్ బౌలర్లలో బ్రాండన్ గ్లోవర్ మూడు; బాస్ లే దే, ఫ్రెడ్ క్లాసేన్ చెరో రెండు; మీకేరాన్ ఒక వికెట్ పడగొట్టారు. కొలిన్ అకేర్మేన్ కు ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’ దక్కింది.

Also Read ICC Men’s T20 World Cup 2022:  ఆఫ్ఘన్ పై ఆసీస్ గెలుపు

RELATED ARTICLES

Most Popular

న్యూస్