Sunday, January 19, 2025
Homeసినిమా'రానా నాయుడు' మూటగట్టుకున్నది ఇదే!

‘రానా నాయుడు’ మూటగట్టుకున్నది ఇదే!

వెబ్ సిరీస్ అంటే బూతులు ఉండాలి .. బూతులు వండాలి .. బూతులు పండాలి అనే ఒక బలమైన అభిప్రాయానికి కొంతమంది మేకర్స్ వచ్చేశారు. బూతు అనేది కేవలం డైలాగ్స్ పరంగా మాత్రమే వినిపిస్తారా? చూపిస్తే అరిగిపోతారా? అని ప్రేక్షకులు అలుగుతారని భావించారేమో, అలాగే చేద్దాం అంటూ మేకర్స్ ముందుకు వెళుతున్నారు. ‘ఆ మాట కొస్తే బూతు ఎక్కడ లేదండీ’ అని సమర్ధించుకునే వారి సంఖ్య కూడా ఎక్కువగానే కనిపిస్తోంది.

అయితే కొన్ని వెబ్ సిరీస్ లు చూసినప్పుడు .. కొన్ని పాత్రలను డిజైన్ చేసిన తీరును చూసినప్పుడు, అందులో బూతులు ఉండే అవకాశం ఉందనే విషయం అర్థమైపోతుంది. ఇంతకుముందు ఇలాంటివి లేవని చెప్పడం కాదు .. ఈ తరహా కథల్లో .. పాత్రల్లో వెంకటేశ్ – రానా కనిపించడమే ఇక్కడ ప్రధానమైన విషయం. ఇతర పాత్రలతో కలిసి ఈ ఇద్దరూ ఇలాంటి సీన్స్ ను షేర్ చేసుకోవడమే ప్రధానమైన సమస్య.

హీరోగా వెంకటేశ్ కి ఎంత క్లీన్ ఇమేజ్ ఉందనే విషయాన్ని గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన  పనిలేదు. ఇక రానా కూడా ఈ వెబ్ సిరీస్ లో తన పాత్ర పరిధిని దాటకుండా చూసుకోవలసింది. అందునా తమకి దగ్గరగా ఉన్న టైటిల్ తో చేసేటప్పుడు మరింత జాగ్రత్తలు తీసుకోవాల్సింది. వెబ్ సిరీస్ చేయడానికి వెంకటేశ్ ముందుకు రావడం ఆయన గొప్పతనమే. ట్రెండ్ ను అందుకోవాలనే ఉత్సాహంతో ఆయన ఇలాంటి పాత్రను చేసి ఉండొచ్చు. ఈ వెబ్ సిరీస్ ఏ స్థానంలో నిలిచింది అనే విషయాన్ని పక్కన పెడితే, ఏం చెప్పాలనుకున్నారనేది అర్థం కాదు. బాధ్యత లేని ఒక తండ్రి .. అవినీతి పరుడైన ఒక కొడుకు సాగించిన ప్రయాణంగా అల్లిన ఈ కథపై విమర్శలను గుప్పిస్తున్నవారి సంఖ్య పెరిగిపోతుండటం విచారించదగివిషయమే.

RELATED ARTICLES

Most Popular

న్యూస్