Saturday, November 23, 2024
HomeTrending Newsతెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మ‌న్‌గా ఆంజ‌నేయ గౌడ్

తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మ‌న్‌గా ఆంజ‌నేయ గౌడ్

తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్‌గా డాక్ట‌ర్ ఈడిగ ఆంజనేయ గౌడ్ నియామ‌కం అయ్యారు. ఈ మేర‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. స్పోర్ట్స్ అథారిటీ చైర్మ‌న్‌గా ఆంజ‌నేయ గౌడ్‌ను సీఎం కేసీఆర్ నియ‌మించారు. అందుకు సంబంధించిన నియామకపత్రాన్ని సోమవారం ప్రగతి భవన్‌లో కేసీఆర్ చేతుల మీదుగా ఆంజనేయ గౌడ్ అందుకున్నారు. తనను చైర్మన్ గా నియమించినందుకు సీఎం కేసీఆర్‌కు ప్ర‌త్యేక‌ కృతజ్జతలు తెలిపారు.

తెలంగాణ‌లో 2016లో నూతనంగా ఏర్పాటైన తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యుడిగా ఆంజ‌నేయ‌గౌడ్ సేవ‌లందించారు. ఆంజనేయ గౌడ్ జోగులాంబ జిల్లా,గట్టు మండలం, ఆలూరు గ్రామానికి చెందిన వ్య‌క్తి. ఆయన ఉస్మానియా యూనివర్సిటీ నుండి న్యాయశాస్త్రంలో పీహెచ్‌డీ పూర్తి చేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్