మేఘాంశ్ శ్రీహరి, రియా సచ్దేవ ప్రధాన పాత్రల్లో నూతన దర్శకుడు జి. భవానీ శంకర్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘మిస్టర్ బ్రహ్మ ఏంటి ఈ డ్రామా?’. A2 పిక్చర్స్ బ్యానర్ పై సంధ్యా రాణి, స్వరూప రాణి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హీరో మంచు మనోజ్ క్లాప్ కొట్టగా, చోటా కె నాయుడు కెమెరా స్విచాన్ చేశారు. ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు బాబీ కొల్లి గౌరవ దర్శకత్వం వహించారు. అనంతరం టైటిల్ పోస్టర్ లాంచ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చిత్ర యూనిట్ కు శుభాశీస్సులు అందించారు.
ఈ చిత్రం కోసం ప్రముఖ తారాగణం, అగ్రశ్రేణి సాంకేతిక నిపుణులు వర్క్ చేస్తున్నారు. సి . రామ్ ప్రసాద్ కెమరామెన్ గా పని చేస్తుండగా.. స్టార్ కంపోజర్ గోపి సుందర్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఎంఆర్ వర్మ ఎడిటర్ కాగా, రఘు కులకర్ణి ఆర్ట్ డైరెక్టర్. పోసాని కృష్ణ మురళి, సునీల్, హర్ష వర్ధన్, శ్రీనివాస్ రెడ్డి, నెల్లూరు సుదర్శన్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.
హీరో మేఘాంశ్ శ్రీహరి మాట్లాడుతూ.. ప్రారంభోత్సవ వేడుకకి వచ్చి మమ్మల్ని బ్లెస్ చేసిన మంత్రి తలసాని గారికి, మనోజ్ అన్నకి, బాబీ అన్నకి, చోటా గారికి కృతజ్ఞతలు. దర్శకుడిని నమ్మి ఈ సినిమా చేస్తున్నాను. మా నిర్మాత చాలా గొప్ప సపోర్ట్ ఇచ్చారు. గోపిసుందర్, రామ్ ప్రసాద్ గారు లాంటి బెస్ట్ టెక్నిషియన్స్ ఈ చిత్రానికి పని చేయడం ఆనందంగా వుంది. మమ్మల్ని నమ్మి ఇంత భారీగా సినిమాని నిర్మిస్తున్న నిర్మాతకు మరోసారి కృతజ్ఞతలు. అందరికీ నచ్చే సినిమా ఇది. ఈ సినిమాతో టీమ్ అందరికీ మంచి పేరు వస్తుందని ఆశిస్తున్నాను” అన్నారు.