Saturday, January 18, 2025
Homeసినిమాతకిట తదిమి తందాన చిత్రం ప్రారంభం.

తకిట తదిమి తందాన చిత్రం ప్రారంభం.

Tandana: ‘మర్డర్’ మూవీ ఫేమ్ ఘన ఆదిత్య, ప్రియ జంటగా, రాజ్ లోహిత్ దర్శకత్వం లో ఎల్లో మాంగో ఎంటర్ టైన్మెంట్, వ్యాస స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం “తకిట తదిమి తoధాన” . ఈ రోజు హైదరాబాద్ లోని వ్యాస స్టూడియోలో పూజా  కార్యక్రమాలు వైభవoగా జరిగాయి. ముహుర్త‌పు స‌న్నివేశానికి సకినాల నరేంధర్  రెడ్డి  కెమెరా  ఆన్ చేయగా FTIH ఫౌండర్ & CEO కటకం ఉదయ్ కిరణ్ క్లాప్ కొట్టారు.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత చందన్ కుమార్ మాట్లాడుతూ… ఈ చిత్రం ఈ నెల 20  నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటుంది. ఇదొక వెరైటీ కధ. మంచి ఎమోషన్ ఉంటుంది. సినిమా ప్రారంభం నుంచి చివ‌రి వ‌ర‌కు ఇంట్ర‌స్టింగ్ గా ఉంటుంది. ఓ కొత్త త‌ర‌హా సినిమాను చూసిన ఫీలింగ్ క‌లిగిస్తుంది. ఖ‌చ్చితంగా అంద‌రికీ ఈ సినిమా న‌చ్చుతుంది. ఈ మూవీకి సంబంధించిన మ‌రిన్ని వివ‌రాల‌ను త్వ‌ర‌లో తెలియ‌చేస్తాం అన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్