వరుణ్‌తేజ్ యాక్షన్ మోడ్‌లోకి దిగేశారు. ఆయన నటిస్తున్న ‘గాంఢీవధారి అర్జున’ సినిమా నయా షెడ్యూల్ యుఎస్ఎలో జరుగుతోంది. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ఇటీవల మేకర్స్ విడుదల చేసిన స్ట్రైకింగ్ గ్లింప్స్ కి, టైటిల్‌కి అద్భుతమైన స్పందన వస్తోంది. సినిమా మీద అంచనాలు పెంచేస్తోంది గ్లింప్స్. అక్టోబర్ నుంచి శర వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇటీవల యూరోపియన్ కంట్రీస్‌లో భారీ షెడ్యూల్‌ని పూర్తి చేశారు. యాక్షన్ సీక్వెన్స్ కోసం ఫారిన్ టెక్నీషియన్లు పని చేస్తున్నారు.ముసోరిలో పిక్చర్‌స్క్వేర్ లొకేషన్లలో నయా షెడ్యూల్‌ని ప్రారంభించారు.
ఈ షెడ్యూల్లో అత్యంత భారీ యాక్షన్ ఎపిసోడ్స్‌ని తెరకెక్కిస్తున్నారు. అద్భుతమైన ప్రొడక్షన్ వేల్యూస్‌తో రూపొందిస్తున్నారు బీవీయస్‌యన్ ప్రసాద్, బాపినీడు. ఎస్వీసీసీ పతాకం పై తెరకెక్కుతోంది ఈ సినిమా.వరుణ్ తేజ్ ఈ చిత్రంలో సెక్యూరిటీ ఆఫీసర్‌గా కనిపిస్తారు. అత్యంత ప్రమాదకరమైన పరిస్థితుల నుంచి ప్రజలను అతను ఎలా కాపాడాడు.? అతని స్ట్రాటజీస్ ఏంటి.? అనేది ఆసక్తికరంగా ఉంటుంది. వరుణ్‌తేజ్ కెరీర్‌లో అత్యంత భారీ చిత్రం ఇదే. మిలిటరీ ఔట్‌ఫిట్‌లో వరుణ్‌తేజ్ లుక్ చూసిన వారు అద్భుతంగా ఉందని మెచ్చుకుంటున్నారు. ఈ మూవీకి సంగీతం మిక్కీ.జె.మేయర్ అందిస్తున్నారు.గాంఢీవధారి అర్జునకు సంబంధించిన మిగిలిన విషయాలన్నీ త్వరలోనే ప్రేక్షకులతో పంచుకుంటాం అన్నారు మేకర్స్.