Saturday, November 23, 2024
Homeస్పోర్ట్స్తొలి వన్డేలో కివీస్ మహిళల గెలుపు

తొలి వన్డేలో కివీస్ మహిళల గెలుపు

Kiwis women won: న్యూజిలాండ్- ఇండియా మహిళల క్రికెట్ సిరీస్ లో భాగంగా నేడు జరిగిన మొదటి వన్డేలో కివీస్  62 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. న్యూ జిలాండ్ విసిరిన 275 పరుగుల విజయ లక్ష్యాన్ని చేరుకోవడంలో ఇండియా తడబడింది.  కెప్టెన్ మిథాలీ రాజ్-59;  యస్తిక భాటియా-41; పూజా వస్త్రాకర్-23; రిచా ఘోష్-22  మినహా మిగిలిన వారు విఫలం కావడంతో 49.4  ఓవర్లలో 213 పరుగులకే ఆలౌట్ అయ్యింది.  కివీస్ బౌలర్లలో జెస్ కెర్ర్ నాలుగు; హెలీ జేన్సేన్ రెండు; లియా తుహుహు, సోఫీ డేవిన్,  హన్నా రో, అమేలియా కెర్ర్ తలా ఒక వికెట్ సాధించారు.

క్వీన్ స్టోన్స్ లోని జాన్ డేవిస్ ఓవల్ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్ లో ఇండియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.  ఓపెనర్ బేట్స్ సెంచరీ తో (106 పరుగులు, 111 బంతులు; 10 ఫోర్లు) రాణించింది.  సాట్టెర్త్  వైత్ 63; అమేలియా కెర్ర్-33 పరుగులు చేశారు. నిర్ణీత 50 ఓవర్లలో 275 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఇండియా బౌలర్లలో  గోస్వామి, పూజా వస్త్రాకర్, గాయక్వాడ్, దీప్తి శర్మ తలా రెండు వికెట్లు; పూనం యాదవ్ ఒక వికెట్ సాధించారు.

సెంచరీ సాధించిన సుజీ బేట్స్ కు ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’ దక్కింది.

ఈ విజయంతో ఐదు వన్డేల సిరీస్ లో కీవీస్ 1-0 ఆధిక్యంతో నిలిచింది. ఇదే వేదికగా రెండో మ్యాచ్ ఫిబ్రవరి 15న జరగనుంది.

Also Read : ప్రొ కబడ్డీ: పూణే; యూపీ విజయం

RELATED ARTICLES

Most Popular

న్యూస్