Cricket West Indies: వెస్టిండీస్ పరిమిత ఓవర్ల క్రికెట్ సారధ్య బాధ్యతల నుంచి నికోలస్ పూరన్ తప్పుకున్నాడు. ఇటీవలి టి 20 ప్రపంచ కప్ టోర్నమెంట్ లో పేలవ ప్రదర్శనతో సూపర్12 కు చెరక ముందే జట్టు నిష్క్రమించింది. దీనితో ఇంటా బైటా జట్టు తీవ్రమైన విమర్శలు తలెత్తాయి. పొట్టి ఫార్మాట్ లో ఇప్పటికే రెండు సార్లు కప్ గెల్చుకున్న కరేబియన్లు ఈ సీజన్ లో స్కాట్లాండ్, ఐర్లాండ్ లాంటి జట్లపై కూడా ఓటమి పాలైంది.
జట్టుకు తన సేవలు ఆటగాడిగా అందిస్తానని, రాబోయే రోజుల్లో తన పూర్తి ప్రదర్శన చూపేందుకే కెప్టెన్ పదవి వదులుకుంటున్నానని పూరన్ చెప్పాడు. జాతీయ జట్టుకు సారధ్యం వహించడం అరుదైన గౌరవమని, తనకు సహకరించిన జట్టు సభ్యులకు, క్రికెట్ వెస్టిండీస్ కు కృతజ్ఞతలు తెలియజేశారు. ఇటీవలి టి 20 వరల్డ్ కప్ లో తమ ప్రదర్శన తీవ్రంగా నిరాశ పరిచిందని, ఈ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని రాబోయే రోజుల్లో రాటుదేలి మళ్ళీ దాడిలో పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశాడు.