తెలంగాణ తేజం, బాక్సింగ్ ప్లేయర్ నిఖత్ జరీన్ మరోసారి సత్తా చాటి ఛాంపియన్ గా నిలిచింది. భోపాల్ వేదికగా జరుగుతోన్న నేషనల్ ఛాంపియన్ షిప్ -2022 పోటీల్లో 48-50 కిలోల విభాగంలో గోల్డ్ మెడల్ సాధించింది. నేడు జరిగిన ఫైనల్లో రైల్వేస్ జట్టుకు చెందిన అనామిక పై 4-1 తేడాతో విజయం సాధించింది. నిన్న జరిగిన సెమీ ఫైనల్లో ఆల్ ఇండియా పోలీస్ ప్లేయర్ శివేందర్ కూర్ సిద్ధూను 5-0తో ఓడించి ఫైనల్లో అడుగు పెట్టిన సంగతి తెలిసిందే.
ఈ ఏడాది నిఖత్ కు ఎంతో కలిసొచ్చింది. ఈఏడాది మొదట్లో ఇస్తాంబుల్ లో జరిగిన వరల్డ్ ఛాంపియన్ షిప్ పోటీల్లో గోల్డ్ మెడల్ గెల్చుకున్న నిఖత్ ఆ తర్వాత బర్మింగ్ హామ్ లో జరిగిన కామన్ వెల్త్ గేమ్స్ లో కూడా 50 కిలోల్ లైట్ ఫ్లై వెయిట్ విభాగంలో గోల్డ్ మెడల్ సాధించింది.