Saturday, January 18, 2025
Homeసినిమారవితేజ తో పోటీకి సై అంటున్న నిఖిల్

రవితేజ తో పోటీకి సై అంటున్న నిఖిల్

మాస్ మహారాజా రవితేజ ఈమధ్య కాలంలో రాజా ది గ్రేట్ మూవీతో సక్సెస్ సాధించారు. ఆతర్వాత టచ్ చేసి చూడు, నేల టిక్కెట్టు, అమర్ అక్బర్ ఆంటోని, డిస్కోరాజా చిత్రాల్లో నటించినప్పటికీ ఏమాత్రం మెప్పించలేకపోయాడు. అలాంటి టైమ్ లో మలినేని గోపీచంద్ డైరెక్షన్ లో నటించిన క్రాక్ అనే సినిమాతో మెప్పించాడు. బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ సాధించాడు. ఆతర్వాత మళ్లీ ఖిలాడి, రామారావు ఆన్ డ్యూటీ చిత్రాలతో నిరాశ పరిచాడు. ఇప్పుడు ‘ధమాకా‘ అంటూ వచ్చేందుకు రెడీ అయ్యాడు. ఈ చిత్రానికి త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ లో ఈ సినిమా రూపొందుతోంది.

ఈ సినిమాను డిసెంబర్ 23న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ మూవీ రిలీజ్ డేట్ ని అఫిషియల్ గా అనౌన్స్ చేయడం కూడా జరిగింది. ఇదలా ఉంటే.. నిఖిల్ సిద్ధార్థ్ మూడు నెలల క్రితం తన సినిమాకి డేట్ ఇవ్వడం లేదు అని చాలా బాధపడ్డాడు. ‘కార్తికేయ 2’ సినిమా విడుదలకి సరైన డేట్ ఇవ్వకుండా చూస్తున్నారు అని ఆల్మోస్ట్ మీడియా ముందు ఏడ్చేశాడు. అప్పుడు ఆయన పరిస్థితి అలా ఉంది. కార్తికేయ 2 భారీ విజయం సాధించడం, హిందీలో కూడా హిట్ కావడంతో నిఖిల్ కి పాన్ ఇండియా స్టార్ అయిపోయానని ధీమా వచ్చేసింది.

ఇప్పుడు నిఖిల్ విడుదల డేట్ గురించి, ఇతర సినిమాల పోటీ గురించి భయపడడం లేదు. ఎవరితో అయినా పోటీకి సై అంటున్నాడు. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 23న ధమాకా సినిమాని విడుదల చేస్తున్నట్లు రవితేజ ప్రకటించాడు. ఆ సినిమాకి పోటీగా ఇప్పుడు ’18 పేజెస్’ సినిమా వస్తోంది. కార్తికేయ 2 హిట్ కాకపోయి ఉంటే రవితేజ సినిమాకి పోటీగా తన సినిమాని నిలిపేందుకు భయపడేవాడు నిఖిల్. కానీ.. ఇపుడు ఆ భయం లేదు. అందుకే ముందుకు వెళుతున్నాడు. ఇంకా చెప్పాలంటే.. రవితేజ భయపడాల్సిన పరిస్థితి. ఏది ఏమైనా సక్సెస్ ఇచ్చే కిక్కే వేరప్పా. మరి.. ఈ పోటీలో ఎవరు విన్నర్ గా నిలుస్తారో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్