Saturday, January 18, 2025
Homeసినిమా‘శ్రీదేవి శోభన్ బాబు’ నుంచి ‘నిను చూశాక' పాట

‘శ్రీదేవి శోభన్ బాబు’ నుంచి ‘నిను చూశాక’ పాట

Ninu Chusaka: సంతోష్ శోభన్, గౌరి జి కిషన్ హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం ‘శ్రీదేవి శోభన్ బాబు’. గోల్డ్ బాక్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యానర్ పై ప్ర‌శాంత్ కుమార్ దిమ్మ‌ల ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని మెగాస్టార్ చిరంజీవి కుమార్తె సుష్మిత కొణిదెల‌, విష్ణు ప్ర‌సాద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా నుంచి ‘నిను చూశాక..’ అనే పాటను సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ విడుదల చేశారు.

నిను చూశాక.. పాట మెలోడీ సాంగ్. సంతోష్ శోభన్, గౌరి జి కిషన్ (జాను ఫేమ్) లపై చిత్రీకరించారు. రాకేందు మౌళి రాసిన ఈ పాటకు  కమ్రాన్ అద్భుతమైన ట్యూన్‌ని కంపోజ్ చేయగా,  జునైద్ కుమార్ ఆల‌పించారు. ప్ర‌శాంత్ కుమార్ దిమ్మల ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ‘శ్రీదేవి శోభన్ బాబు’ చిత్రం రెండు వేర్వేరు మ‌న‌స్త‌త్వాలున్న అమ్మాయి, అబ్బాయి మ‌ధ్య సాగే సంఘ‌ర్ష‌ణ‌, ప్రేమ వంటి ఎలిమెంట్స్‌ను తెలియ‌జేస్తుంది. శ‌ర‌ణ్య పొట్ల ఈ మూవీకి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. సుష్మిత కొణిదెల ఈ సినిమాకు కాస్ట్యూమ్స్ డిజైన‌ర్‌గానూ వ‌ర్క్ చేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్