Saturday, January 18, 2025
Homeసినిమానా కెరీర్ లోనే బెస్ట్ ఓపెనింగ్ ‘మాచర్ల నియోజకవర్గం’ : నితిన్

నా కెరీర్ లోనే బెస్ట్ ఓపెనింగ్ ‘మాచర్ల నియోజకవర్గం’ : నితిన్

యంగ్ అండ్ వెర్సటైల్ హీరో నితిన్ మాస్, కమర్షియల్ యాక్షన్ ఎంటర్‌ టైనర్‌ ‘మాచర్ల నియోజకవర్గం’. ఈ చిత్రం  కమర్షియల్ సక్సెస్ ని అందుకుంది. ఎమ్.ఎస్.రాజ శేఖర్ రెడ్డి దర్శకత్వంలో శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ పై సుధాకర్ రెడ్డి, నికితారెడ్డి నిర్మించారు. నిన్న ఆగష్టు 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకుంది. ఈ సందర్భంగా ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలుపుతూ మీడియా మీట్ నిర్వహించింది చిత్ర యూనిట్.

నితిన్ మాట్లాడుతూ “తెలుగు ప్రేక్షకులకు చాలా పెద్ద థాంక్స్. నా కెరీర్ లోనే బెస్ట్ ఓపెనింగ్స్ ఇచ్చారు. మీ ప్రోత్సాహం ఎప్పుడూ ఉంటుందని నమ్మాను. నా నమ్మకం ‘మాచర్ల నియోజకవర్గం’తో మరోసారి నిజమైయింది. చాలా కాలం తర్వాత నా జోనర్ ని మార్చి యాక్షన్ లోకి వెళ్లాను. దీనిని ప్రేక్షకులు అద్భుతంగా రీసివ్ చేసుకున్నారు. సినిమాని ఆడియన్స్ తో థియేటర్లో చూశాను. యాక్షన్, కామెడీ సీన్స్ కి మీరు ఇచ్చే చప్పట్లు విజల్స్ మంచి ఉత్సాహాన్ని ఇచ్చాయి. సినిమా రెవెన్యు చాలా బావుంది. రెండో రోజు కూడా చాలా బలంగా వుందని చెబుతున్నారు”

“వెన్నెల కిషోర్ గారి కామెడీ, యాక్షన్ సీన్స్, నా లుక్ కి చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. కృతి శెట్టి, డీవోపీ ప్రసాద్ మురెళ్ళ, ఆర్ట్ డైరెక్టర్ సాహి సురేష్ ,, అందరూ ది బెస్ట్ వర్క్ ఇచ్చారు. సాగర్ ఇచ్చిన పాటలు , నేపధ్యం సంగీతం సినిమాలో అద్భుతంగా వున్నాయి. ఇలాంటి సమయంలో ఇంత మంచి ఓపెనింగ్ ఇవ్వడం చాలా ఆనందంగా వుంది. ఇలాగే కష్టపడుతూ ఇంకా మంచి సినిమాలు తీస్తాను. సినిమాని ఇంత గొప్పగా ఆదరించిన ప్రేక్షకులకు మరోసారి కృతజ్ఞతలు” తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్