Saturday, January 18, 2025
Homeసినిమాఓటీటీలో.. నితిన్ మాస్ట్రో..?

ఓటీటీలో.. నితిన్ మాస్ట్రో..?

కరోనా కారణంగా థియేటర్లు మూతపడడంతో.. ఓటీటీలకు టైమ్ వచ్చింది. భారీ, క్రేజీ మూవీస్ ను డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ చేసేందుకు భారీ ఆఫర్స్ తో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. అయినప్పటికీ స్టార్ హీరోలు, డైరెక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్స్ తమ చిత్రాలను థియేటర్లో రిలీజ్ చేయడానికే ఇంట్రస్ట్ చూపిస్తున్నాయి. విజయ్, పూరి ‘లైగర్’ మూవీకి ఓ ప్రముఖ ఓటీటీ సంస్థ 200 కోట్ల ఆఫర్ ఇచ్చిందని వార్తలు రావడం తెలిసిందే. ఆ వార్తలను విజయ్ ఖండించారు. తాజాగా నితిన్ సినిమా ‘మాస్ట్రో’ను ఓటీటీలో రిలీజ్ చేయునున్నారని వార్తలు వస్తున్నాయి.

బాలీవుడ్‌లో సక్సస్ సాధించిన ‘అంధాదున్‌’ మూవీకి అఫీషియల్ రీమేక్‌గా ‘మాస్ట్రో’ రూపొందుతోంది. ఈ చిత్రానికి యంగ్ డైరెక్టర్ మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో నితిన్ సరసన నభా నటేష్ నటిస్తుంటే.. మిల్కీ బ్యూటీ తమన్నా కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇటీవల షూటింగ్ కంప్లీట్ అయినట్టు చిత్ర బృందం ప్రకటించింది. ప్రముఖ ఓటీటీ ‘డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌’లో నేరుగా డిజిటల్ రిలీజ్ చేయనున్నారని వార్తలు వస్తున్నాయి. హిందీ డబ్బింగ్ కాకుండా 32 కోట్లకు పైగా నిర్మాత సుధాకరరెడ్డి ఆశిస్తున్నారని టాక్. ఆ రేటు మీద డిస్కషన్లు జరుగుతున్నాయని సమాచారం. మరో వైపు 28 కోట్లకు బేరం హాట్ స్టార్ తో సెటిల్ అయిపోయిందని వినిపిస్తోంది. ప్రచారంలో ఉన్న వార్తల పై త్వరలో క్లారిటీ రానుంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్