Sunday, November 24, 2024
HomeTrending Newsకెసిఆర్ ఆరోపణలు నిరాధారం - నీతి ఆయోగ్

కెసిఆర్ ఆరోపణలు నిరాధారం – నీతి ఆయోగ్

ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు చేసిన వ్యాఖ్యలపై నీతి అయోగ్ ప్రతిస్పందించింది. సిఎం కెసిఆర్ పూర్తిగా నిరాధారమైన ఆరోపణలు చేశారని నీతి ఆయోగ్ వ్యాఖ్యానించింది. ఉన్నత లక్ష్యాలతో ఏర్పడిన నీతి ఆయోగ్ కార్యాచరణను వివరిస్తూ ఢిల్లీ లో ఈ రోజు ప్రకటన విడుదల చేశారు.

• పటిష్టమైన రాష్ట్రాలతో పటిష్టమైన దేశాన్ని తయారు చేయగలమనే ఉద్దేశ్యంతో సహకార సమాఖ్య స్ఫూర్తితో ‘‘నీతి ఆయోగ్’’ను ఏర్పాటు చేశారు.
• ‘‘నీతి ఆయోగ్’’ రాష్ట్రాలతో కలిసి పని చేసేందుకు అనేక చర్యలు తీసుకుంది. గత ఏడాది నీతి ఆయోగ్ వైస్ చైర్మన్/ సభ్యులు ముఖ్యమంత్రులతో 30కి పైగా సమావేశాలు నిర్వహించారు.
• ఈ సమావేశాల్లో పలు కేంద్ర మంత్రిత్వ శాఖల ద్వారా రాష్ట్రాలకు సంబంధించిన అనేక సమస్యలకు పరిష్కారం కనుగొన్నారు.
• నీతి ఆయోగ్ అభ్యర్థనలు పెడచెవిన పెట్టిన తెలంగాణ ముఖ్యమంత్రి నీతి ఆయోగ్‌తో సమావేశం నిర్వహించలేదు.
• జాతీయ ప్రాముఖ్యత కలిగిన అన్ని సమస్యలపై కేంద్ర ప్రభుత్వం, కేంద్ర మంత్రిత్వ శాఖలు, ప్రధాన మంత్రి కార్యాలయం రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలతో సంభాషిస్తోంది.
• ఆగస్ట్ 7, 2022 పాలక మండలి సమావేశానికి సన్నాహకంగా, తెలంగాణతో సహా కేంద్రం, రాష్ట్రాల మధ్య వివరణాత్మక సంప్రదింపులు జరిగాయి.
• 2022 జూన్ లో ధర్మశాలలో మొదటి జాతీయ ప్రధాన కార్యదర్శుల సమావేశం జరిగింది.
• తెలంగాణ ప్రధాన కార్యదర్శితో సహా అన్ని రాష్ట్రాలు/యుటిల ప్రధాన కార్యదర్శులు పాల్గొని చర్చించారు.
• ఎజెండా తయారీలో రాష్ట్రాల అభిప్రాయం తీసుకోలేదన్న తెలంగాణ ముఖ్యమంత్రి  ఆరోపణ నిరాధారం.
• జల్ జీవన్ మిషన్ కింద గత 4 సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు దీని కింద రూ.3982 కోట్లు కేటాయించింది. అయితే రాష్ట్రం కేవలం రూ.200 కోట్లు వినియోగించుకోవాలని ఎంచుకుంది.
• ఇదిగాక 2014-2015 నుండి 2021-2022 మధ్య కాలంలో తెలంగాణకు PMKSY-AIBP-CADWM కింద రూ.1195 కోట్లు విడుదలయ్యాయి.
• జాతీయ ప్రాముఖ్యత కలిగిన ప్రతిష్టాత్మక పథకాలు/కార్యక్రమాలతో సహా ఆర్థిక విషయాలలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు నిరంతరం సహకరిస్తోంది.
• కేంద్ర ప్రాయోజిత పథకాల కింద కేటాయింపులు 2015-16లో రూ. 2,03,740 కోట్లు ఉంటే 2022-23లో రూ. 4,42,781 కోట్లుగా ఉంది, అంటే రెట్టింపు కంటే ఎక్కువ పెరిగాయి.
• 14వ ఆర్థిక సంఘం రాష్ట్రాల కేటాయింపులను 32% నుండి 42 శాతానికి పెంచింది.
• CSS కింద కేటాయించిన నిధుల వినియోగానికి తగిన వెసులుబాటు కల్పించింది.
• ఆగస్టు 7న జరగనున్న నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశంలో పాల్గొనకూడదని నిర్ణయించుకొని, నిరాధార ఆరోపణలతో సమస్యలను రాజకీయం చేసేందుకు ప్రయత్నించడం దురదృష్టకరం.
• గవర్నింగ్ కౌన్సిల్ అనేది ‘టీమ్ ఇండియా’ అత్యున్నత స్థాయిలో చర్చించి, దేశాభివృద్ధికి సత్ఫలితాలిచ్చే పరిష్కారాలను సూచించే వేదిక.

Also Read నీతి ఆయోగ్ భేటీ బహిష్కరణ – కెసిఆర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్