Sunday, January 19, 2025
Homeసినిమామ‌రిన్ని వైవిధ్య‌మైన పాత్ర‌లు పోషిస్తా: నివేదిత సతీష్

మ‌రిన్ని వైవిధ్య‌మైన పాత్ర‌లు పోషిస్తా: నివేదిత సతీష్

Will Do: అందాల  తార నివేదిత సతీష్ ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉంది. తెలుగు, తమిళం, హిందీలో వరుస సినిమాలు చేస్తూ ఫుల్‌ బిజీగా ఉంది. ప్రస్తుతం చాలా సినిమాల్లో న‌టిస్తోంది ఈ బ్యూటీ. సినిమాలే కాకుండా పలు వాణిజ్య ప్రకటనలకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా కూడా ఉంటోంది నివేదిత సతీష్. అన్యాస్ ట్యుటోరియ‌ల్ లో న‌టించింది. ఇటీవ‌ల‌ రిలీజ్ అయిన ‘అన్యాస్ ట్యుటోరియల్’  ఆహాలో భారీ వ్యూస్ ని సొంతం చేసుకుంది.

ఈ వెబ్ సిరీస్ నివేదితకు మంచి పేరు తీసుకువ‌చ్చింది. అలాగే ఇటీవలే అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అయిన సుజల్ లోని నటనకి సౌత్ ఇండియాలో భారీ స్పందన వచ్చింది. దీంతో ఈ అమ్మ‌డు ఇంటర్నేషనల్ గుర్తింపు పొందింది. సుజ‌ల్ 100 మిలియన్ ప్లస్ గంటలు వీక్షించడం జ‌రిగింది. ప‌లు చిత్రాల్లో న‌టిస్తూ బిజీగా ఉన్న ఈ అమ్మ‌డు న‌ట‌కు అవ‌కాశం ఉన్న మరిన్ని వైవిధ్య‌మైన పాత్ర‌ల‌ను పోషించాలి అనుకుంటుంద‌ట‌. మ‌రి.. తెలుగులో మ‌రిన్ని అవ‌కాశాల‌ను అందిపుచ్చుకుంటుందేమో చూడాలి.

Also Read : వెబ్ సిరీస్ చేస్తోన్న వేగేశ్న సతీష్‌ 

RELATED ARTICLES

Most Popular

న్యూస్