Sunday, November 24, 2024
HomeTrending Newsజాతీయ స్థాయిలో ఉచిత కరెంటు ఇస్తాం - కెసిఆర్

జాతీయ స్థాయిలో ఉచిత కరెంటు ఇస్తాం – కెసిఆర్

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాలనలో అంతర్జాతీయంగా కూడా దేశ పరువు దిగజారుతోందని ముఖ్యమంత్రి కెసిఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో ప్రశ్నించే ప్రతిపక్షాలను కట్టడి చేసేందుకు ప్రభుత్వాలను పడగోడుతున్నారన్నారు. ఇలాంటి పాలన మనకు అవసరమా అని కెసిఆర్ ప్రశ్నించారు. సంతలో పశువులను కొన్నట్టుగా ప్రజాప్రతినిధులను కొని ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు. దేశ రాజకీయాలను ప్రభావితం చేసేందుకు జాతీయ రాజకీయాల్లోకి వెళతామని కెసిఆర్ ప్రకటించారు. అన్ని రంగాలలో విపలమైన బిజెపి గోదావరి నీరు పారే కాలువలలో మత పిచ్చితో రక్తం పరించాలని చూస్తున్నారని ఆరోపించారు.

నిజామాబాద్ పర్యటనలో భాగంగా సిఎం చంద్రశేఖర్ రావు ఈ రోజు కొత్తగా నిర్మించిన కలెక్టర్ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత TRS నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత జరిగిన బహిరంగసభలో మాట్లాడుతూ బిజెపి పాలన, బిజెపి నేతలు..కేంద్ర ప్రభుత్వ విధానాలపై విరుచుకుపడ్డారు.

 

ఈ రాష్ట్రంలో ఏ జరుగుతోందో…పక్కన మాహారాష్ట్రలో ఏం జరుగుతోందో నిజామాబాద్ ప్రజలు గమనిస్తున్నారని కెసిఆర్ అన్నారు. దేశంలో ఏ రాష్ట్రం కూడా రైతు బంధు మాదిరిగా ఆర్థిక సాయం చేయటం లేదు. శ్రీ రాం సాగర్ వరద కాలువకు గతంలో మోటారు పెడితే కేసులు అయ్యేది. తెలంగాణ వచాక ఎవరైనా అడిగార అని రైతులను ప్రశ్నించారు.

 

దేశంలో అన్ని అమ్ముతున్న బిజెపికి ఇక మిగిలింది రైతులేనని, వారి భూమి మీద కన్ను పడిందని కెసిఆర్ అన్నారు. రైతుల భూమి, పంటలు, వ్యవసాయం మీద మోడీ మిత్రుల కన్ను పడిందన్నారు. రైతుల భూమి తీసుకొని వారిని కూలీలుగా మార్చే పెద్ద కుట్ర జరుగుతోందని, రైతులు ఈ విషయం మీద చర్చించాలని కెసిఆర్ కోరారు. తన మిత్రులకు 12 లక్షల కోట్లు మాఫీ చేసిన మోడీ రైతులకు కరెంటు మాఫీకి లక్షా నలభై అయిదు వేల కోట్లు ఇవ్వకపోగా..  అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు.

 

రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో బిజెపి ప్రభుత్వం కూలిపోవటం ఖాయమని కెసిఆర్ అన్నారు. ఆ తర్వాత ఏర్పడే బిజెపి యేతర ప్రభుత్వంలో ప్రజాసంక్షేమ కార్యక్రమాలు చేపడతామన్నారు. ఢిల్లీ గద్దె మీద కూడా మన ఎగురుతుందని, మన ప్రభుత్వమే రాబోతుందని కెసిఆర్ అన్నారు. నిజామాబాద్ వేదికగా కొత్త హామీ ఇస్తున్నానన్న కెసిఆర్ రాబోయే రోజుల్లో జాతీయ స్థాయిలో రైతులకు ఉచిత విద్యుత్ అందిస్తామని ప్రకటించారు. దేశం ఒకసారి దెబ్బతింటే మళ్ళీ కోలుకోవటం కష్టమని కెసిఆర్ అన్నారు. దుర్మార్గమైన బిజెపి ప్రభుత్వాన్ని సాగనంపాలని..బిజెపి ముక్త్ భారత్ కోసం పజలు కలిసి రావాలని కెసిఆర్ పిలుపు ఇచ్చారు. ఇటీవల రైతాంగ నేతల సమావేశంలో తెలంగాణలో వ్యవసాయ విధానాలు బాగున్నాయని ప్రశంసించారు. జాతీయ రాజకీయాల్లోకి రావాలని రైతాంగ నేతలు కోరారని.. మీరంతా ఆశిర్వాదిస్తే జాతీయ స్థాయిలో పనిచేస్తానని కెసిఆర్ అన్నారు.

Also Read : మునుగోడులో గెలుపు మనదే  కెసిఆర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్