Saturday, January 18, 2025
Homeతెలంగాణవైద్యం, వాక్సిన్ విషయంలో ఆందోళన వద్దు: డిహెచ్

వైద్యం, వాక్సిన్ విషయంలో ఆందోళన వద్దు: డిహెచ్

రాష్ట్రంలో లాక్ డౌన్ అమల్లో వున్నా వైద్య సేవలు, వాక్సిన్ పంపిణి విషయంలో ఎవరూఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలంగాణా ఆరోగ్య శాఖ డైరెక్టర్ (డిహెచ్) శ్రీనివాసరావు వెల్లడించారు.  అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులు…..రోగనిర్ధారణ, పరీక్షా కేంద్రాలతో సహా అన్ని వైద్య ఆరోగ్య సేవలు యధావిధిగా పనిచేస్తాయని వివరించారు.

కోవిడ్ -19 టీకాను ప్రజలకు అందించే ప్రభుత్వ టీకా కేంద్రాలు కూడా సాధారణంగా పనిచేస్తాయని, రెండవ డోస్ పొందటానికి అర్హత ఉన్నవారికి మాత్రమే టీకాలు ఇస్తామని స్పష్టం చేశారు. రెండవ డోస్ కోసం  వచ్చే వారు..   మొదటి డోస్  తీసుకున్న రశీదు లేదా మొబైల్ లో మెసేజ్ చూపించాల్సి ఉంటుందన్నారు.

రెండవ డోస్ కోసం వచ్చే అర్హులైన వారు తమ ఆధార కార్డు వెంట తెచ్చుకోవాలని,  కరోనా లక్షణాలు ఉన్నవాళ్లు టెస్టుల కోసం వెళ్లొచ్చని శ్రీనివాసరావు ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్