Sunday, February 23, 2025
HomeTrending Newsబీసీలంటే టిడిపి; టిడిపి అంటే బీసీలు: అచ్చెన్న

బీసీలంటే టిడిపి; టిడిపి అంటే బీసీలు: అచ్చెన్న

BCs for TDP: గ్రామాల్లో వైసీపీ నేతలను ప్రజలు ఎక్కడిక్కడ నిలదీస్తున్నారని, పరిపాలనను అసహ్యించుకుంటున్నారని టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. ప్రజలు అడిగే ప్రశ్నలు సమాధానం చెప్పలేక వైసీపీ నేతలు పారిపోతున్నారని ఎద్దేవా చేశారు. ఒంగోలులో మహానాడు ఏర్పాటుకు వేదిక ఏర్పాటు చేసుకుంటే అనుమతి ఇవ్వకపోవడం దారుణమని, ఆ ప్రదేశంలో కాకపోయినా తాము ఎంపిక చేసుకున్న మరో చోట  అనుమతి ఇవ్వాలని అయన డిమాండ్ చేశారు.

వైసీపీ గాలివాటులో వచ్చిన పార్టీ అని, గాలికే పోతుందని అచ్చెన్న వ్యాఖ్యానించారు. తెలుగుదేశం పార్టీకి ఎన్నికలు కొత్త కాదని, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని, తమ పార్టీకి 160 సీట్లు వస్తాయని అచ్చెన్న పునరుద్ఘాటించారు.

బిసీలంటే టిడిపి, టిటిపి అంటే బీసీలని, వారితో టిడిపికి ఉన్న అనుబంధాన్ని ఎవ్వరూ విడదీయలేరని ధీమా వ్యక్తం చేశారు. బీసీలకు పదవులిచ్చి మాట్లాడే ఛాన్స్ లేకుండా  తొక్కిపెడుతున్నారని అచ్చెన్న విమర్శించారు.   జగన్ రాజ్య సభ సీటు ఇచ్చిన నలుగురిలో ఇద్దరు టిడిపి నుంచి  వచ్చిన వారే ఉన్నారని గుర్తు చేశారు.

Also Read : అద్భుతం జరుగుతుంది: పవన్ వ్యాఖ్యలు

RELATED ARTICLES

Most Popular

న్యూస్