సెర్బియా స్టార్ నోవాక్ జకోవిచ్ వింబుల్డన్-2022 విజేతగా నిలిచాడు. నేడు జరిగిన ఫైనల్లో ఆస్ట్రేలియా ఆటగాడు నికీ కిర్గియోస్ పై 4-6; 6-3;6-4; 7-6 తేడాతో విజయం సాధించి తన కెరీర్ లో 21వ గ్రాండ్ స్లామ్ గెల్చుకొని… ప్రపంచంలో అత్యధిక సార్లు ఈ టైటిల్స్ గెల్చుకున్న ఆటగాళ్ళలో రెండో స్థానంలో నిలిచాడు. రఫెల్ నాదల్ 22 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ గెల్చుకొని మొదటి స్థానంలో ఉన్నాడు.
కోవిడ్ టీకా తీసుకొని కారణంగా ఈ ఏడాది జరిగిన ఆస్ట్రేలియన్, ఫ్రెంచ్ ఓపెన్ టోర్నమెంట్లలో ఆడలేకపోయిన ఆరునెలల విరామం తరువాత అంతర్జాతీయ మ్యాచ్ లలో అడుగు పెట్టినా సత్తా చాటి టైటిల్ సాధించడం విశేషం.
జకోవిచ్ తన కెరీర్ లో ఇప్పటి వరకూ ఆస్ట్రేలియన్-9; వింబుల్డన్-7; యూఎస్ ఓపెన్-3 ఫ్రెంచ్ ఓపెన్-2 సార్లు గెల్చుకున్నాడు. 39 సార్లు గ్రాండ్ స్లామ్ ఫైనల్స్ ఆడిన మొదటి ఆటగాడిగా కూడా జకోవిచ్ రికార్డు తన పేరిట లిఖించుకున్నాడు.