Sunday, January 19, 2025
HomeTrending Newsత్రోయిక ప్లస్ సమావేశం పై అందరి దృష్టి

త్రోయిక ప్లస్ సమావేశం పై అందరి దృష్టి

NOW The focus Of The World Is On The Islamabad Meeting :

ఆగస్టులో తాలిబన్లు అధికారం కైవసం చేసుకున్నాక ఆఫ్ఘన్లో శాంతి భద్రతలు మరింత సన్నగిల్లుతున్నాయి. ఆఫ్ఘనిస్తాన్ లో పరిణామాలపై పొరుగు దేశాలు ఎవరికీ తోచిన రీతిలో వారు వ్యవహరిస్తున్నారు. ఎవరికీ వారే సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఆఫ్ఘన్లో శాంతి స్థాపన కోసం రష్యా, భారత్, పాకిస్తాన్, ఇరాన్ దేశాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే ఎవరి ద్వారా ఎక్కువ లబ్ది పొందవచ్చో చైనా గమనిస్తోంది.

ముఖ్యంగా అక్టోబర్ 19వ తేదిన రష్యా అధ్వర్యంలో మాస్కోలో ఆఫ్ఘన్ పొరుగు దేశాలు సమావేశం అయ్యాయి. ఈ సమావేశంలో రష్యా, ఇరాన్, పాకిస్తాన్, చైనా, ఇండియా,ఉజ్బెకిస్తాన్, కజకిస్తాన్ తదితర దేశాలు పాల్గొన్నా పెద్దన్న అమెరికా ఈ సమావేశానికి డుమ్మా కొట్టింది. మహిళల హక్కులు, లింగ వివక్ష లేకుండా ఉద్యోగ, ఉపాధి రంగాల్లో అవకాశాలు, మైనారిటీలకు రక్షణ తదితర అంశాలతో మాస్కో డిక్లరేషన్ ప్రకటించారు. ఈ సమావేశంలో విదేశాంగ శాఖ కార్యదర్శులు పాల్గొన్నారు.

ఇదే అంశంపై నిన్న ఢిల్లీలో మరో సమావేశం జరిగింది. ఆఫ్ఘన్ పరిణామాలపై ఇండియా అధ్వర్యంలో ప్రాంతీయ భద్రతపై చర్చ పేరుతో నిర్వహించిన ఈ సమావేశంలో రష్యా,ఇరాన్, మధ్య ఆసియా దేశాలైన కిర్గిస్తాన్, ఉజ్బెకిస్తాన్, కజకిస్తాన్, తుర్కమేనిస్తాన్, తజికిస్తాన్ దేశాలు పాల్గొన్నాయి. చైనా, పాకిస్తాన్ దేశాలను ఆహ్వానించినా రాలేదు. జాతీయ భద్రతా సలహాదారులు పాల్గొన్న ఈ ఆఫ్ఘన్ భూభాగాన్ని ఉగ్రవాదానికి అనుమతించ వద్దని, అందరికి సమాన అవకాశాలు, మహిళల హక్కులు, మైనారిటీల రక్షణ, మాదక ద్రవ్యాల నిరోధం తదితర అంశాలతో ఢిల్లీ డిక్లరేషన్ ప్రకటించారు.

ఇక ఈ రోజు పాకిస్తాన్ అధ్వర్యంలో ఇస్లామాబాద్ లో త్రోయిక ప్లస్ పేరుతో ఆఫ్ఘన్ పరిస్తితులపైనే మరో సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో అమెరికా, రష్యా, చైనా, ఇరాన్, తజికిస్తాన్, కిర్గిస్తాన్, ఉజ్బెకిస్తాన్, తుర్కమేనిస్తాన్ దేశాలతో పాటు ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తకి పాల్గొనటం విశేషం. తాలిబాన్ ప్రభుత్వం ఏర్పడ్డాక ఓ విదేశీ గడ్డపై జరుగుతున్న సమావేశానికి హాజారుకావటం ఇదే మొదటిసారి. దానికి తోడు అమెరికా, చైనా లు కూడా రావటంతో ఈ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది. పాకిస్తాన్ విదేశాంగ మంత్రి షా మహమూద్  ఖురేషి అధ్యక్షతన జరిగే ఈ మీటింగ్ లో జాతీయ భద్రత అధికారులు పాల్గొంటున్నారు.

ఇప్పుడు ప్రపంచ దేశాల దృష్టి ఇస్లామాబాద్ సమావేశం పైనే ఉంది. ముఖ్యంగా అమెరికా, రష్యా, చైనా, పాకిస్తాన్ ఇరాన్ దేశాలతో పాటు ఆఫ్ఘన్ విదేశాంగ మంత్రి కూడా చర్చల్లో భాగస్వాములు అవుతున్నారు. దీంతో త్రోయిక ప్లస్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంటారని అంతర్జాతీయ రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Also Read : ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ ల వశం

RELATED ARTICLES

Most Popular

న్యూస్