Saturday, January 18, 2025
Homeసినిమాఎన్టీఆర్, త్రివిక్రమ్ మళ్లీ కలుస్తున్నారా..?

ఎన్టీఆర్, త్రివిక్రమ్ మళ్లీ కలుస్తున్నారా..?

ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్.. వీరిద్దరూ కలిసి ‘అరవింద సమేత’.. వీర రాఘవ అనే సినిమా చేశారు. ఫాక్షన్ మూవీ అయిన ఈ సినిమా ఎన్టీఆర్ కు కమర్షియల్ సక్సెస్ అందించడంతో పాటు మంచి పేరు తీసుకువచ్చింది. దీంతో వీరిద్దరూ కలిసి మరో సినిమా చేయాలి అనుకున్నారు. అనుకోవడమే కాదు.. ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్లో మరో మూవీని అనౌన్స్ చేయడం కూడా జరిగింది. ఆర్ఆర్ఆర్ మూవీ పూర్తి చేసిన వెంటనే ఈ సినిమాని స్టార్ట్ చేయాలి అనుకున్నారు.
రెగ్యులర్ షూటింగ్ చేయడానికి అంతా సిద్ధం అయ్యింది.

ఇక త్వరలోనే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్న టైమ్ లో ఏమైందో ఏమో కానీ.. ఈ సినిమా ఆగిపోయింది. అప్పటి నుంచి ఎన్టీఆర్, త్రివిక్రమ్ మధ్య విభేదాలు వచ్చాయని టాక్ వినిపించింది. ప్రచారంలో ఉన్నది నిజమో కాదో తెలియదు కానీ.. ఇప్పుడు వీరిద్దరూ మళ్లీ కలిసి సినిమా చేయాలి అనుకుంటున్నారట. తాజాగా మళ్లీ ఎన్టీఆర్ – త్రివిక్రమ్ కలిసి పని చేయాలనుకుంటున్నారట. గత కొంత కాలంగా తనకు దూరంగా వుంటున్న ఓ బడా ప్రొడ్యూసర్ ఎన్టీఆర్ తో సినిమా చేయాలని రీసెంట్ గా కలిశారట. వెంటనే ఎన్టీఆర్ సదరు ప్రొడ్యూసర్ తో త్రివిక్రమ్ తో చేద్దాం.. వెళ్లి కలవమన్నాడట.

తను చెప్పింది విని ముందు షాక్ అయిన సదరు నిర్మాత ఎన్టీఆర్ చెప్పినట్టే వెళ్లి త్రివిక్రమ్ ని కలిసి విషయం చెప్పారట. అంతా విన్న త్రివిక్రమ్ చేద్దాం అని చెప్పారట. ఎంటైర్ ఎపిసోడ్ ని బట్టి చూస్తుంటే త్రివిక్రమ్ తో కలిసి వర్క్ చేయాలని ఎన్టీఆర్ అనుకుంటున్నాడని తెలుస్తోంది. ఈ వార్త బయటకు రావడంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే.. ఈ మూవీ మహేష్ తో త్రివిక్రమ్ చేస్తున్న మూవీ తర్వాత ఉంటుందా..? ఇంకా ఆలస్యం అవ్వచ్చా..?  అనేది తెలియాల్సివుంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్