Sunday, January 19, 2025
Homeసినిమాఎన్టీఆర్, చరణ్‌.. ఈ ఇద్దరిలో జాన్వీ నటించేది ఎవరితో..?

ఎన్టీఆర్, చరణ్‌.. ఈ ఇద్దరిలో జాన్వీ నటించేది ఎవరితో..?

అతిలోక సుందరి శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీ కపూర్ ను తెలుగు తెరకు పరిచయం చేయాలని గత కొంతకాలంగా దర్శకనిర్మాతలు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు కానీ.. ఇప్పటి వరకు కుదరలేదు. ఎంత పెద్ద సినిమా ఆఫర్ వచ్చినా జాన్వీ నో చెప్పడంతో అసలు ఆమెకు తెలుగు సినిమాల్లో నటించాలనే ఇంట్రస్ట్ ఉందా..? లేదా..? అనే అనుమనాలు కూడా వచ్చాయి. బోనీ కపూర్ మాత్రం జాన్వీ ఖచ్చితంగా తెలుగు సినిమాల్లో నటిస్తుందని చెప్పడం.. అలాగే జాన్వీ కూడా నటిస్తానని ఓ ఇంటర్ వ్యూలో చెప్పడంతో ఏ సినిమాతో జాన్వీ తెలుగు తెరకు పరిచయం కానుంది అనేది ఆసక్తిగా మారింది.

ఇదిలా ఉంటే.. ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో రూపొందే సినిమాలో జాన్వీ నటించనున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలో జాన్వీని కాంటాక్ట్ చేశారని.. ఆమె ఓకే చెప్పిందని టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాతో పాటు జాన్వీకి మరో భారీ ఆఫర్ వచ్చింది. అదే.. రామ్ చరణ్‌ సరసన నటించే అవకాశం. శంకర్ తో చేస్తున్న మూవీ తర్వాత చరణ్‌.. బుచ్చిబాబు డైరెక్షన్ లో భారీ పాన్ ఇండియా మూవీ చేయనున్నారు. ఇందులో చరణ్ కు జంటగా జాన్వీ కఫూర్ ను ఎంపిక చేశారని టాలీవుడ్ లో టాక్ బలంగా వినిపిస్తోంది.

అయితే.. ఇప్పుడు ఈ రెండు సినిమాల్లో ఏ సినిమాకి ఓకే చెప్పాలి అని జాన్వీ తెగ టెన్షన్ పడుతుందట. రెండు సినిమాలు చేయాలంటే డేట్స్ అడ్జెస్ట్ చేయడం సెట్ కావడం లేదట. అందుచేత ఎన్టీఆర్, చరణ్‌ ఈ రెండు సినిమాల్లో ఒక సినిమానే చేయడం కుదురుతుందని ఆలోచనలో పడిందట జాన్వీ. ఇంకా చెప్పాలంటే… ఎన్టీఆర్, చరణ్ ఈ ఇద్దరిలో ఎవరితో సినిమా చేయాలో తేల్చుకోలేక నలిగిపోతుందట ఈ అమ్మడు. మరి.. ఈ ఆర్ఆర్ఆర్ హీరోల్లో ఎవరితో నటించేందుకు జాన్వీ ఓకే చెబుతుందో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్