Sunday, January 19, 2025
Homeసినిమాఎన్టీఆర్ మూవీ రిలీజ్ డేట్.. లేటెస్ట్ న్యూస్.

ఎన్టీఆర్ మూవీ రిలీజ్ డేట్.. లేటెస్ట్ న్యూస్.

For Summer: యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ మూవీలో కొమ‌రం భీమ్ పాత్ర‌లో అద్భుతంగా న‌టించి మెప్పించ‌డంతో నార్త్ ఆడియ‌న్స్ సైతం ఎన్టీఆర్ నెక్ట్స్ మూవీ కోసం ఆతృత‌గా ఎదురు చూస్తున్నారు. బాలీవుడ్ బ‌డా మేక‌ర్స్ ఎన్టీఆర్ తో సినిమా చేసేందుకు ఆస‌క్తి చూపించిన‌ప్ప‌టికీ.. ఎన్టీఆర్ మాత్రం నెక్ట్స్ మూవీని కొర‌టాల శివ‌తోనే చేయాల‌ని ఫిక్స్ అయ్యారు. ఈ మూవీని అఫిషియ‌ల్ గా ఎప్పుడో అనౌన్స్ చేశారు కానీ.. ఇప్ప‌టి వ‌ర‌కు సెట్స్ పైకి వెళ్ల‌లేదు.కార‌ణం ఏంటంటే… ఆచార్య అట్ట‌ర్ ప్లాప్ అవ్వ‌డంతో క‌థ పై మ‌రోసారి క‌స‌ర‌త్తు చేయ‌మ‌ని ఎన్టీఆర్ చెప్ప‌డంతో కొర‌టాల అదే ప‌నిలో ఉన్నార‌ట‌. అందుక‌నే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ల‌డం ఆల‌స్యం అయ్యింది. ఇదిలా ఉంటే.. ఈ సినిమా ఇంకా సెట్స్ పైకి వెళ్ల‌లేదు. అప్పుడే ఈ మూవీ రిలీజ్ డేట్ ఇదే అంటూ వార్త‌లు హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. మేట‌ర్ ఏంటంటే.. ఈ సినిమా అనుకున్న‌ట్టుగా జూన్ లో సెట్స్ పైకి వెళితే సంక్రాంతికి రిలీజ్ చేయాలి అనుకున్నారు.

ఇప్పుడు సెట్స్ పైకి వెళ్ల‌డం ఆల‌స్యం అవుతుండ‌డంతో సంక్రాంతికి రావ‌డం కుద‌ర‌దు కాబ‌ట్టి స‌మ్మ‌ర్ లో ఈ చిత్రాన్ని విడుద‌ల చేయాల‌ని ఫిక్స్ అయ్యార‌ని టాక్ వినిపిస్తోంది. స‌మ్మ‌ర్ లో ఎప్పుడంటే.. ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా మే 19న రిలీజ్ చేయాల‌ని ఫిక్స్ అయ్యార‌ని టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది.

Also Read : నా మనసు కలచివేసింది: జూనియర్ 

RELATED ARTICLES

Most Popular

న్యూస్