Sunday, January 19, 2025
Homeసినిమాఎన్టీఆర్ 30కి అంతా సిద్ధం

ఎన్టీఆర్ 30కి అంతా సిద్ధం

యంగ్ టైగర్ ఎన్టీఆర్, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లో జనతా గ్యారేజ్ మూవీ రూపొందడం.. ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ అవ్వడం తెలిసిందే. ఆతర్వాత వీరిద్దరూ కలిసి సినిమా చేయాలనుకున్నారు. అ కానీ.. ఇప్పటి వరకు సెట్స్ పైకి వెళ్లలేదు. కారణం ఏంటంటే.. కొరటాల తెరకెక్కించిన ఆచార్య అట్టర్ ఫ్లాప్ అవ్వడంతో ఎన్టీఆర్ కథ పై మళ్లీ వర్క్ చేయమని చెప్పడంతో అప్పటి నుంచి కొరటాల కథ పై కుస్తీ పడుతూనే ఉన్నారు. ఇటీవల ఎన్టీఆర్ కు కొరటాల ఫుల్ నెరేషన్ ఇవ్వడం.. ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది.

అయితే.. గత కొన్ని రోజులు నుంచి అభిమానులు అప్ డేట్ అడగడం.. ఎన్టీఆర్ 30 మేకర్స్ ఇదిగో మూవీ స్టార్ట్ అవుతుంది.. అదిగో అంతా రెడీ అయ్యింది అనడమే కానీ ఎప్పుడు సెట్స్ పైకి వస్తుందో క్లారిటీగా చెప్పలేదు. ఆమధ్య ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఫుల్ స్పీడుగా జరుగుతుందని వర్కింగ్ స్టిల్స్ రిలీజ్ చేశారు. అంతే కాకుండా.. గోవాలో లోకేషన్స్ సెర్చ్ చేస్తున్నారని వార్తలు వచ్చాయి. ఆతర్వాత యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుథ్ తో కొరటాల మ్యూజిక్ సిట్టింగ్స్ జరుగుతున్నాయని కూడా టాక్ వినిపించింది. అయితే.. నవంబర్ లో ఈ మూవీ సెట్స్ పైకి వెళుతుంది అనుకున్నారు కానీ.. వెళ్లలేదు. ఆతర్వాత డిసెంబర్ అని టాక్ వచ్చింది కానీ.. డిసెంబర్ లో కూడా షూటింగ్ స్టార్ట్ కాలేదు.

లేటెస్ట్ న్యూస్ ఏంటంటే… ఈ చిత్రానికి సంక్రాంతికి ముహూర్తం కుదిర్చారట. ఈసారి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సినిమా మొదలు పెట్టేలా ప్లాన్ చేస్తున్నారట. పక్కాగా షూటింగ్ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేశారని తెలిసింది. త్వరలోనే మంచి ముహుర్తం చేసుకుని షూటింగ్ ఎప్పుడు అనేది డేట్ తో సహా అనౌన్స్ చేస్తారట. ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధా ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. పాన్ ఇండియా మూవీగా రూపొందే ఈ సినిమాలో ఎన్టీఆర్ కు జంటగా జాన్వీ కపూర్ నటించనున్నట్టు సమాచారం.

RELATED ARTICLES

Most Popular

న్యూస్