Monday, June 17, 2024
Homeసినిమా ఆర్ఆర్ఆర్ సీక్వెల్ కన్ ఫర్మ్ చేసిన జక్కన్న

 ఆర్ఆర్ఆర్ సీక్వెల్ కన్ ఫర్మ్ చేసిన జక్కన్న

బాహుబలి, బాహుబలి 2 తర్వాత దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన సంచలన చిత్రం ఆర్ఆర్ఆర్. ఇందులో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్ర పోషిస్తే.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ అల్లూరి సీతారామరాజు పోషించారు. ఈ మూవీ దాదాపు 1200 కోట్లకు పైగా కలెక్ట్ చేసి సంచలనం సృష్టించింది. ఇటీవల జపాన్ లో ఆర్ఆర్ఆర్ రిలీజ్ చేశారు. అక్కడ 25 ఏళ్లుగా ముత్తు రికార్డ్ ఉంది. ఇప్పుడు ఆ రికార్డ్ ను ఆర్ఆర్ఆర్ మూవీ క్రాస్ చేయడం విశేషం. జపాన్ లో అత్యథిక కలెక్షన్స్ సాధించిన ఇండియన్ మూవీగా ఆర్ఆర్ఆర్ చరిత్ర సృష్టించింది.

ఇదిలా ఉంటే.. ఆర్ఆర్ఆర్ మూవీ రిలీజ్ తర్వాత ఆర్ఆర్ఆర్ మూవీకి సీక్వెల్ ప్లాన్ చేస్తున్నట్టు రైటర్ విజయేంద్రప్రసాద్ ఓ ఇంటర్ వ్యూలో తెలియచేశారు. ఎన్టీఆర్ ఇంట్రస్ట్ గా ఉన్నాడని కూడా చెప్పారు. ఆతర్వాత ఆర్ఆర్ఆర్ సీక్వెల్ గురించి ఎలాంటి అప్ డేట్ రాలేదు. అయితే.. ఆర్ఆర్ఆర్ సీక్వెల్ పై ఇప్పుడు రాజమౌళి స్పందించారు. ఆర్ఆర్ఆర్ సీక్వెల్ పై కసరత్తు చేస్తున్నామని రాజమౌళి క్లారిటీ ఇచ్చారు. బ్రిటీష్ వారి పై వీరుల యుద్ధం కొనసాగుతుందని కూడా హాలీవుడ్ వెరైటీ మ్యాగజైన్ పేర్కొంది. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ ఆస్కార్ ప్రచార బరిలో ఉన్న రాజమౌళి తన తండ్రి స్క్రీన్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ తో మంతనాలు సాగించానని తెలిపారు. సీక్వెల్ కథ పై సీరియస్ గా పని చేస్తున్నారని వెరైటీ మ్యాగజైన్ కి జక్కన్న తెలిపారు.

ఆర్ఆర్ఆర్ చిత్రీకరించే సమయంలో సీక్వెల్ ఆలోచన లేదని.. అయితే.. ఆర్ఆర్ఆర్ విజయం సాధించిన తర్వాత సీక్వెల్ పైనా కొంత చర్చించాం. కొన్ని మంచి ఆలోచనలను షేర్ చేసుకున్నాం కానీ.. సీక్వెల్ తీసేంత గొప్ప ఆలోచనను కనుగోలేదు. ఆ తర్వాత దానిని వదిలివేసాం అని అన్నారు. అయితే.. తన కోర్ టీమ్ లో ఒకరు తనకు తోచిన ఆలోచన చెప్పారు. అది చాలా గొప్ప ఆలోచన కావడంతో సీక్వెల్ పై వర్క్ చేస్తున్నాం అన్నారు. ఇదే కనుక జరిగితే.. మరోసారి చరిత్ర సృష్టించడం ఖాయం.

Also Read :  జపాన్ లో చరిత్ర సృష్టించిన ఆర్ఆర్ఆర్ 

RELATED ARTICLES

Most Popular

న్యూస్