Sunday, January 19, 2025
Homeసినిమాఎన్టీఆర్, ప్ర‌శాంత్ నీల్ మూవీకి ముహ‌ర్తం ఫిక్స్?

ఎన్టీఆర్, ప్ర‌శాంత్ నీల్ మూవీకి ముహ‌ర్తం ఫిక్స్?

Crazy Cambo: యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమాలో కొమ‌రం భీమ్ గా న‌ట విశ్వ‌రూపం చూపించ‌డం.. అంద‌రి ప్ర‌శంస‌లు పొంద‌డం తెలిసిందే. ఇప్పుడు ఎన్టీఆర్.. కొర‌టాల శివ‌తో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నారు. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుపుకుంటుంది. ఈ సినిమా జూన్ నుంచి సెట్స్ పైకి వెళ్ల‌నుంది. అయితే.. ఈ సినిమా త‌ర్వాత సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్ తో ఎన్టీఆర్ ఓ సినిమా చేయ‌నున్నారు.

ఎన్టీఆర్, ప్ర‌శాంత్ నీల్ కాంబినేష‌న్లో మూవీ గురించి గ‌త కొన్ని రోజులుగా వార్త‌లు వ‌స్తూనే ఉన్నాయి. ఈ భారీ చిత్రాన్ని ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మించ‌నుంది. అయితే.. ఈ సినిమా ఎప్పుడు స్టార్ట్ కానుంది అనేది అఫిషియ‌ల్ గా అనౌన్స్ చేయ‌లేదు కానీ.. ఓ వార్త బ‌య‌ట‌కు వ‌చ్చింది. అది ఏంటంటే.. ఈ భారీ చిత్రాన్ని దసరాకి అధికారికంగా లాంచ్ చేసి.. నవంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ జరపాలని మేకర్స్ ప్లాన్ చేశారట.

అలాగే.. 2024 దసరాకి సినిమాని రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఏది ఏమైనా ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కలయికలో భారీ చిత్రం వస్తోంది అనేసరికి నేషనల్ రేంజ్ లో ఈ సినిమా పై భారీ అంచనాలు ఏర్ప‌డ్డాయి. ఎన్టీఆర్ మాస్ ఇమేజ్ కి, ప్రశాంత్ నీల్ విజువల్స్ తోడు అయితే.. మరో వండర్ ఫుల్ సినిమా అయ్యే అవకాశం ఉంది. మ‌రి.. ఎన్టీఆర్, ప్ర‌శాంత్ నీల్ క‌లిసి బాక్సాఫీస్ ని ఏ రేంజ్ లో షేక్ చేస్తారో చూడాలి.

Also Read : ఎన్టీఆర్ మూవీలో సాయిప‌ల్ల‌వి నిజ‌మేనా..?

RELATED ARTICLES

Most Popular

న్యూస్