Saturday, September 21, 2024
HomeTrending Newsదేశీయ డిమాండు తరువాతే చమురు ఎగుమతి - కేంద్రం

దేశీయ డిమాండు తరువాతే చమురు ఎగుమతి – కేంద్రం

దేశంలో మోటార్ స్పిరిట్ (ఎంఎస్), హైస్పీడ్ డీజిల్ (హెచ్ఎస్డీ)లను నేపాల్, భూటాన్ కాకుండా ఇతర దేశాలకు గత అయిదు సంవత్సరాలలో ఎగుమతి చేశారా అని కేంద్రప్రభుత్వాన్ని వైసీపీ పార్లమెంటరీ చీఫ్ విప్, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్ ప్రశ్నించారు. అలాగే రిఫైనరీ బదిలీ ధరతో పోలిస్తే ఎంఎస్, హెచ్ఎస్డీ ఇంధనాన్ని ఎగుమతి చేయడం లాభదాయకంగా ఉందా అని కేంద్రాన్ని ఎంపీ మార్గాని భరత్ ప్రశ్నించారు. అలా అయితే ఎంఎస్ సరఫరా చేయకపోవడానికి కారణాలేమిటని ప్రశ్నించారు. ఎంపీ మార్గాని లోక్‌సభలో అడిగిన ప్రశ్నలకు కేంద్ర పెట్రోలియం, నేచురల్ గ్యాస్ మంత్రి రామేశ్వర్ తేలి లిఖితపూర్వక సమాధానం ద్వారా గురువారం ఎంపీ భరత్ కు తెలియజేశారు.

దేశంలో ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ లిమిటెడ్ (ఐఓసీఎల్), భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్ ), హిందుస్తాన్ పెట్రోలియం కార్పోరేషన్ లిమిటెడ్ (హెచ్పీసీఎల్) ఎంఎస్, హెచ్ఎస్డీలను ఎగుమతి చేస్తాయని చెప్పారు. ‌గత అయిదు సంవత్సరాలలో ఒక్క 2019-20 లో మాత్రమే మోటార్ స్పిరిట్ ను ఎగుమతి చేయలేదని తెలిపారు. ప్రధానంగా హైస్పీడ్ డీజిల్ కే ఎక్కువ డిమాండు ఉండటం వల్ల గత 2017 నుండి ఇప్పటి వరకూ అంటే ఈ‌ అయిదేళ్ల కాలంలో మోటార్ స్పిరిట్ 1,391 వెయ్యి మెట్రిక్ టన్నులు (టీఎంటీ), అలాగే హైస్పీడ్ డీజిల్ (హెచ్ఎస్డీ) 9,580 టీఎంటీలు ఇతర దేశాలకు ఎగుమతి చేసినట్టు కేంద్ర మంత్రి వివరించారు. ‌ప్రభుత్వరంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు (ఓఎంసీ) మిగులు ఎంఎస్, జెచ్ఎస్డీలను ఎగుమతి చేస్తాయని తెలిపారు. అయితే ప్రధానంగా దేశంలోని దేశీయ డిమాండును తీర్చిన తరువాతే ఇతర దేశాలకు ఎగుమతి చేస్తాయని చెప్పారు. ‌మోటార్ స్పిరిట్, హైస్పీడ్ డీజిల్ ఎగుమతి లాభదాయకంతో పోలిస్తే రిఫైనరీ బదిలీ ధరతో (ఆర్టీపీ) వాస్తవానికి ఎగుమతిపై కొనుగోలుదారు కోట్ చేసిన ధరలపై ఆధారపడి ఉంటుందన్నారు. ప్రస్తుతం అకాగే అంచనా వేయబడిన డిమాండు, అభ్యర్థనల ప్రకారం ఎంఎస్, హెచ్ఎస్డీల మిగుల పరిమాణం‌ అందుబాటులో ఉందని ఎంపీ భరత్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా కేంద్ర మంత్రి రామేశ్వర్ తేలి చెప్పారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్