Sunday, January 19, 2025
HomeసినిమాMansion 24 Web Series: ఉత్కంఠను పెంచుతున్న 'మాన్షన్ 24'

Mansion 24 Web Series: ఉత్కంఠను పెంచుతున్న ‘మాన్షన్ 24’

హాట్ స్టార్ నుంచి ఇంతకుముందు చాలానే మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్ లు వచ్చాయి. కంటెంట్ బాగుంటే ఆ సిరీస్ లను ప్రేక్షకులు మళ్లీ మళ్లీ చూస్తూనే ఉన్నారు. సౌత్ నుంచి కూడా ఈ తరహా సిరీస్ లు వచ్చాయి. అయితే బడ్జెట్ పరంగా … తారాగణం పరంగా చూసుకుంటే మాత్రం నార్త్ స్థాయిలో కనిపించేవి తక్కువనే చెప్పాలి. ఆ లోటును తీర్చడానికి అన్నట్టుగా ఇప్పుడు సౌత్ నుంచి ఒక వెబ్ సిరీస్ వస్తోంది. ‘మాన్షన్ 24’ పేరుతో ఈ సిరీస్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేది ఓంకార్.

‘రాజుగారి గది’ టైటిల్ క్రింద ఆయన కొన్ని హారర్ కథలను అందించాడు. ఆ సినిమాల ఫలితం సంగతి అటుంచితే, ఈ తరహా కథలను .. పాత్రలను మలచడంలో ఆయనకి మంచి అనుభవం ఉందనే పేరు తెచ్చుకున్నాడు. ఆయన దర్శకత్వం వహించిన ఈ మిస్టరీ థ్రిల్లర్ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇది ఒక ‘మాన్షన్’ చుట్టూ తిరిగే కథ అనే విషయం అర్థమైపోతూనే ఉంది. హారర్ నేపథ్యంలో ఈ కథ నడుస్తుందనే విషయం తెలిసిపోతూనే ఉంది.

అయితే ఇక్కడ ఆసక్తిని పెంచుతున్న విషయం ఏమిటంటే, ఈ సిరీస్ కోసం తీసుకున్న తారాగణం. తమిళ .. తెలుగు భాషల్లో మంచి క్రేజ్ ను సొంతం చేసుకున్న వరలక్ష్మి శరత్ కుమార్ .. సత్యరాజ్ .. రావు రమేశ్ .. బిందుమాధవి .. అవికా గోర్ ప్రధానమైన పాత్రలలో కనిపిస్తున్నారు. ఇక పాప్యులర్ సీరియల్ ఆర్టిస్టులు చాలామంది ఈ సిరీస్ లో కనిపించనున్నారు. ఈ మధ్య కాలంలో ఇంత భారీ కాస్టింగ్ తో ఇక్కడ వస్తున్న సిరీస్ ఇదేనని అనిపిస్తోంది. అందరిలో ఉత్కంఠను పెంచుతున్న ఈ సిరీస్, ఎంతవరకూ అంచనాలను అందుకుంటుందనేది చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్