Monday, January 20, 2025
HomeTrending Newsమరోసారి రేవంత్ రెడ్డి గృహనిర్భందం

మరోసారి రేవంత్ రెడ్డి గృహనిర్భందం

Revanth Reddy House Arrest : టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని పోలీసులు మరోసారి హౌస్ అరెస్ట్ చేశారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని నివాసం నుంచి ఈ రోజు బయటకు రాకుండా  వేకువ జాము నుంచే ఆయనను నిర్బంధించారు. వరంగల్ జిల్లా భూపాలపల్లి నియోజకవర్గంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమానికి వెళ్లకుండా రేవంత్ ను హౌస్ అరెస్ట్ చేశారు. ఆయన ఇంటికి వెళ్లే అన్ని మార్గాల్లో బ్యారికేడ్లు పెట్టారు. పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించారు. రేవంత్ ను హౌస్ అరెస్ట్ చేయడంపై కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు.

ఇటీవలే కేసీఆర్ దత్తత గ్రామం ఎర్రవెల్లిలో రచ్చబండ కార్యక్రమానికి వెళ్తున్న రేవంత్ ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆరోజు ఉదయం నుంచి ఆయన ఇంటి వద్ద భారీ సంఖ్యలో పోలీసులు మోహరించారు. ఈ క్రమంలో ఆయన అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఆయన ఇంటి వద్దకు చేరుకున్నారు. పోలీసులకు, వారికి మధ్య తోపులాట కూడా జరిగింది. ఆ తర్వాత రేవంత్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Also Read : రేవంత్ రెడ్డి అరెస్ట్

RELATED ARTICLES

Most Popular

న్యూస్