Sunday, January 19, 2025
HomeTrending Newsతెలంగాణలో నోటి కాన్సర్ లు ఎక్కువ - మంత్రి హరీష్

తెలంగాణలో నోటి కాన్సర్ లు ఎక్కువ – మంత్రి హరీష్

Oral Cancers In Telangana Minister Harish Rao :
30 ఏళ్ళల్లో 50% క్యాన్సర్  కేసులు పెరిగాయని, ప్రపంచ వ్యాప్తంగా 100 రకాల క్యాన్సర్  లను గుర్తించారని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు వెల్లడించారు. ఆహారంలో మార్పుల ద్వారా, బరువుని అదుపులో ఉంచితే కొంత వరకు క్యాన్సర్ ని నియంత్రించవచ్చన్నారు. వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా హైదరాబాద్, లక్డీకాపూల్ లోని ప్రభుత్వ ఎం ఎన్ జే క్యాన్సర్ ఆసుపత్రిలో రోటరీ క్లబ్ కోటి రూపాయలు సాయం చేయగా మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ బస్, 7.16 కోట్లతో సిటీ స్కాన్, నినా రావు చారిటబుల్ ట్రస్ట్ తరపున 3కోట్ల తో పేషెంట్స్ అటెండెన్స్ 100 పడకల సత్రాన్ని ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హాని చేస్తాయని, పిహెచ్ సి స్థాయిలో క్యాన్సర్ స్క్రీనింగ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు మంత్రి చెప్పారు.

బిపి, షుగర్ వ్యాధుల లాగే క్యాన్సర్ ని కూడా స్క్రీనింగ్ చేయాలని సర్కారు నిర్ణయించిందని మంత్రి పేర్కొన్నారు. సిబ్బందికి క్యాన్సర్ స్క్రీనింగ్ ట్రైనింగ్ ఇవ్వనున్నామని, గ్రామ స్థాయిలో 40 ఏళ్ళు దాటినా అందరికి క్రమం తప్పకుండా స్క్రీనింగ్  చేస్తామన్నారు. రాష్ట్రంలో  22% నోటి, 13% బ్రెస్ట్ , 12% గర్భాశయ క్యాన్సర్ లు రాష్ట్రంలో వెలుగు చూస్తున్నాయని మంత్రి వివరించారు. వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా ఏంఎన్ జె లో అధునాతన సిటీ స్కాన్  7.16 కోట్లతో   ఏర్పాటు.

300 పడకల ఆస్పత్రిని 65కోట్లతో అరబిందో ఫార్మా సంస్థ నిర్మిస్తోందని, ఏప్రిల్ నెలాఖరు నాటికి కొత్త బ్లాక్ అందుబాటులోకి వస్తుందని మంత్రి చెప్పారు.  పక్కనే ఉన్న మరో 3 ఎకరాల స్థలాన్ని ఎం ఎన్ జె కి త్వరలో కేటాయిస్తామని, ప్రస్తుతం ఎం ఎన్ జె లో మూడు ఆపరేషన్ థియేటర్ లు మాత్రమే ఉన్నాయని, 15 కోట్లతో త్వరలో 8 మాడ్యులార్ థియేటర్ లను అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. ఇందులో ఒకటి రోబోటిక్ థియేటర్, మార్చ్ నెలాఖరుకు కొత్త ఆపరేషన్ థియేటర్ లు అందుబాటులోకి వస్తుందని, ఆరోగ్యశ్రీ కింద క్యాన్సర్ చికిత్సకు ప్రభుత్వం ఏటా 100 కోట్లు ఖర్చు చేస్తోందన్నారు. నిమ్స్, mnj ఆస్పత్రుల్లోనూ క్యాన్సర్ రోగులకు చికిత్స చేస్తారని, జాయింట్ రి ప్లేస్మెంట్ కోసం వైద్యులు 3డి  టెక్నాలజీ తో వాడుతున్నారని వెల్లడించారు.

ఏడాదికి 15000 వేల మంది క్యాన్సర్ రోగులకు ప్రభుత్వం ఉచితంగా వైద్య సేవలు ఆందోస్తోందని, వరంగల్ హెల్త్ సిటీలో అన్ని రకాల వైద్యాలను అందిస్తామన్నారు. కిమో, రేడియో థెరపీలను జిల్లా అసపత్రుల్లోనూ అందుబాటులోకి తేవాలని నిర్ణయించామని, ప్రతి పౌరుడి హెల్త్ ప్రొఫైల్ రూపొందిస్తామని, త్వరలో ప్రయోగాత్మకంగా  ములుగు, సిరిసిల్ల జిల్లలో ప్రారంభం చేస్తామని మంత్రి హరీష్ రావు ప్రకటించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్