Monday, January 20, 2025
HomeTrending Newsమచ్చలేని కుటుంబం మాది: మాగుంట

మచ్చలేని కుటుంబం మాది: మాగుంట

ఢిల్లీ లిక్కర్ స్కామ్ తో తన కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదని వైఎస్సార్ సీపీ నేత, ఒంగోలు లోక్ సభ సభ్యుడు మాగుంట శ్రీనివాసులురెడ్డి  స్పష్టం చేశారు. ఢిల్లీ 32 జోన్లలో తమ బంధువులు కేవలం 2 జోన్లలో మాత్రమే వ్యాపారం చేస్తున్నారని, తమ బంధువర్గం చేసే వ్యాపారాల్లో కూడా మాగుంట అనే పేరు ఉండటం వల్ల తమపై ఆరోపణలు వచ్చాయని వివరించారు.  తమ ఇళ్లు, కార్యాలయాల్లో ఈడీ సోదాలు నిర్వహించిందని,  వారి అనుమానాలు నివృత్తి చేశామని వివరించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ పై సీబీఐ విచారణ కూడా జరుగుతుందన్నారు.

మాగుంట కుటుంబం ఎప్పటికీ మచ్చలేని కుటుంబమేనన్నారు. తమ తండ్రి హయాం నుంచే వ్యాపారాలు చేస్తున్నామని,  70 ఏళ్ళుగా ఈ  మద్యం వ్యాపారంలో ఉన్నామని చెప్పారు. 8 రాష్ట్రాల్లో  తాము వ్యాపారం చేస్తున్నామని తెలిపారు. ఈ వ్యవహారం వల్ల తమ రాజకీయానికి వచ్చిన ఇబ్బందేమీ లేదని అయన ధీమా వ్యక్తం చేశారు.  ప్రకాశం జిల్లా రాజకీయాల్లో తమ కుటుంబం కొనసాగుతుందని, వచ్చే ఎన్నికల్లో తన కుమారుడు రాఘవ పోటీ చేస్తారని ప్రకటించారు.  రాజకీయాలను వ్యాపారాలతో ముడిపెట్టవద్దన్నారు.

Also Read: ఈడీకి లంగలు,దొంగలు భయపడుతరు కెసిఆర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్