Sunday, April 14, 2024
HomeTrending Newsపన్నెండో రోజు భారత్ జోడో యాత్ర

పన్నెండో రోజు భారత్ జోడో యాత్ర

కేరళలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర పన్నెండో రోజు కోనసాగుతోంది. ఈ రోజు ఉదయం అలప్పుజాలోని పునప్ర ప్రాంతంలో యాత్ర ప్రారంభమైంది. యాత్ర ప్రారంభించేందుకు ముందు స్థానికంగా ఉన్న మత్స్యకారులతో రాహుల్ గాంధీ మాట్లాడారు. ఇంధన ధరల పెరుగుదల, చేపలు నిల్వచేసే టెక్నాలజీ, విద్యాహక్కు ఇంకా దేశంలో పెద్ద సవాళ్లుగా మిగిలిపోయాయన్నారు. ఈ పాదయాత్రలో రాహుల్ గాంధీ వెంట కాంగ్రెస్ శ్రేణులు భారీసంఖ్యలో పాల్గొన్నారు. యాత్ర సందర్భంగా దారిపొడవునా నిలుచున్న ప్రజలకు అభివాదం చేస్తూ రాహుల్ గాంధీ ముందుకు సాగారు.

మొత్తం 19 రోజులపాటు కేరళలో జోడో యాత్ర జరగనుంది. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 21న రాహుల్ యాత్ర ఎర్నాకుళం జిల్లాకు.. 23న త్రిస్సూర్ చేరుకోనుంది. సెప్టెంబర్ 26, 27న పాలక్కడ్, 28న మలప్పురంలో భారత్ జోడో యాత్ర కొనసాగనుంది. కేరళలోని 7 జిల్లాల్లో పాదయాత్ర చేయనున్నారు రాహుల్ గాంధీ. అక్టోబర్ 1న కర్ణాటకలోకి యాత్ర ప్రవేశిస్తుంది.

Also Read: రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర

RELATED ARTICLES

Most Popular

న్యూస్