Saturday, November 23, 2024
HomeTrending Newsజనాభా అసమతుల్యతపై సంఘ్‌ ఆందోళన

జనాభా అసమతుల్యతపై సంఘ్‌ ఆందోళన

దేశంలో జనాభా నియంత్రణ విధానం అందరికీ వర్తించాలని రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్‌(ఆర్‌ఎస్‌ఎస్‌) సర్‌ కార్యవాహ మాననీయ దత్తాత్రేయ హోసబాలే అన్నారు. ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్‌రాజ్‌, గౌహానియాలోని జైపురియా పాఠశాలలో సంఘ్‌ నాలుగు రోజుల అఖిల భారత కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా చివరి రోజు బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హోసబాలే మాట్లాడారు. ఈశాన్య రాష్ట్రాలకు చెందిన గిరిజన సమాజంలో ఆత్మగౌరవం కారణంగానే నేను కూడా హిందువునే అనే భావం పెంపొందిందని అన్నారు.

ఇటువంటి ఆత్మగౌరవం మేల్కొనడం వల్లే ఇప్పుడు అక్కడ ప్రజలు సంఘలో చేరాలనుకుంటున్నారని అన్నారు. మేఘాలయ, త్రిపుర రాష్ట్రాల్లోని గిరిజన సంఘాల ప్రజలు కూడా ఈ విషయం తెలుసుకుని పరమపూజ్య సర్‌ సంఘచాలక్‌ని ఆహ్వానించడం ప్రారంభించారని ఆయన తెలిపారు. సంఘ్‌ స్థాపించిన వందేళ్ళ కాలంలో అనేక కోణాల్లో పనిని వేగవంతం చేస్తున్నట్టు తెలిపారు. కరోనా వంటి భయానక సమయాల్లో కూడా సంఘ్‌ తన పనిని కొనసాగించి పురోగతిని సాధించిందన్నారు.

దేశంలో జనాభా విస్ఫోటనం ఆందోళన కలిగిస్తోందని హోసబాలే అన్నారు. అందువల్ల, ఈ అంశాన్ని సమగ్రంగా, ఐక్యంగా పరిశీలించిన తర్వాత, జనాభా విధానాన్ని అందరికీ వర్తించేలా చేయాలి… మతమార్పిడి వల్ల హిందువుల సంఖ్య తగ్గుతోంది. దేశంలోని పలు ప్రాంతాల్లో మతమార్పిడి కుట్ర జరుగుతోంది. కొన్ని సరిహద్దు ప్రాంతాల్లో కూడా చొరబాట్లు జరుగుతున్నాయి. జనాభా అసమతుల్యత కారణంగా చాలా దేశాల్లో విభజన పరిస్థితి ఏర్పడిందని, జనాభా అసమతుల్యత కారణంగా భారతదేశ విభజన కూడా జరిగిందని ఈ సందర్భంగా సర్‌ కార్యవాహ గుర్తు చేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్