Sunday, January 19, 2025
HomeసినిమాBobby: మైత్రీ నిర్మాతలకు షాక్ ఇచ్చిన బాబీ?

Bobby: మైత్రీ నిర్మాతలకు షాక్ ఇచ్చిన బాబీ?

మెగాస్టార్ చిరంజీవితో మైత్రీ బాబీ దర్శకత్వంలో మూవీ మేకర్స్ నిర్మించిన చిత్రం ‘వాల్తేరు వీరయ్య’ . అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుని ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. దీని తర్వాత చిరంజీవి’ భోళా శంకర్’ చేస్తున్నారు కానీ.. బాబీ తదుపరి సినిమా ఎవరితో అనేది ప్రకటించలేదు. ఆమధ్య సూపర్ స్టార్ రజనీకాంత్ తో బాబీ సినిమా కన్ ఫర్మ్ అయ్యిందని ప్రచారం జరిగింది కానీ.. రజనీ జైలర్ మూవీ తర్వాత వేరే ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేయడంతో బాబీ ప్రాజెక్ట్ లేదని వార్తలు వస్తున్నాయి.

అయితే.. బాబీ.. బాలయ్య కోసం కథ రెడీ వినిపించారట, దీనికి బాలయ్య కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలిసింది. ఈ సినిమాను  సితార ఎంటర్ టైన్మెంట్స్ నిర్మిస్తోందని సమాచారం. ఈ వార్త మైత్రి యజమానులను  షాక్ కు గురి చేసిందట. వాల్తేరు వీరయ్య టైమ్ లో బాబీని ఎంతో బాగా చూసుకున్నామని.. తమని అడిగితే.. బాలయ్యతో మాట్లాడి ఈ ప్రాజెక్ట్ సెట్ చేసేవాళ్లం కదా.. సితార సంస్థకు వెళ్లడమేమిటని బాగా ఫీలవుతున్నారట.

అయితే.. బాబీ ఈ విషయంలో మొదటి నుంచీ  క్లారిటీగా ఉన్నాడట. అడ్వాన్సులు వద్దని, హీరోను తీసుకు వచ్చే వారితోనే సినిమా చేస్తానని చెప్పారట. అందులోనో సితార యాజమాన్యం  ఎప్పటి నుంచో సినిమా చేయమని అడిగిందట.  మరోవైపు బాబే గతంలో  పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి ‘వెంకీ మామ’ చేశాడు. ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఆడలేదు. దీంతో మరో సినిమా చేస్తానని వాళ్లకు మాట ఇచ్చాడు కానీ.. ఇంత వరకు చేయలేదు. ఆ సంస్థకు అయినా సినిమా చేయచ్చు కదా అనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

బాలయ్య, బాబీ సినిమాను జూన్ 10న ప్రకటిస్తారని టాక్ వినిపిస్తుంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్