Saturday, November 23, 2024
Homeస్పోర్ట్స్Asia Cup: ఇండియాపై పాకిస్తాన్ విజయం

Asia Cup: ఇండియాపై పాకిస్తాన్ విజయం

ఆసియా కప్ సూపర్-4లో భాగంగా నేడు జరిగిన దాయాదుల పోరులో పాకిస్తాన్ ఐదు వికెట్లతో ఇండియాపై విజయం సాధించింది. చివరి ఓవర్ వరకూ ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్ లో మరో బంతి మిగిలి ఉండగానే  గెలుపు సొంతం చేసుకుంది. పాకిస్తాన్ ఓపెనర్ మహమ్మద్ రిజ్వాన్ 51 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 71 పరుగులు చేయగా…. మహమ్మద్ నవాజ్ 20 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో42 పరుగులతో సూపర్ ఇన్నింగ్స్ ఆది జట్టు విజయంలో కీలక భూమిక పోషించారు.

దుబాయి ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. కెప్టెన్ రోహిత్- కెఎల్ రాహుల్ కలిసి తొలి వికెట్ కు 56 పరుగులు చేశారు. 16 బంతుల్లో మూడు ఫోర్లు, రెండు సిక్సర్లతో 28 పరుగులు చేసి రోహిత్ ఔటయ్యాడు, రాహుల్ కూడా 28 చేసి వెనుదిరిగాడు. విరాట్ కోహ్లీ 44 బంతుల్లో 4 ఫోర్లు, ఒక సిక్సర్ తో 60 పరుగులు చేసి రనౌట్ అయ్యాడు. సూర్య కుమార్ యాదవ్-13, పంత్-14; దీపక్ హుడా-16 పరుగులు చేశారు. చివర్లో రవి బిష్ణోయ్ రెండు బంతుల్లో రెండు ఫోర్లతో 8 పరుగులు చేయడంతో ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 181 పరుగులు చేసింది.

పాకిస్తాన్ బౌలర్లలో షాదాబ్ ఖాన్ రెండు; నసీం షా, మహమ్మద్ హస్నైన్, రాఫ్, నవాజ్ తలా ఒక వికెట్ పడగొట్టారు.

ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన పాక్ 22 పరుగులకు తొలి వికెట్ (కెప్టెన్ బాబర్ ఆజమ్-14); 63 వద్ద రెండో వికెట్ (ఫఖర్ జమన్-15) కోల్పోయింది. ఈ దశలో రిజ్వాన్- నవాజ్ లు మూడో వికెట్ కు 73పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి ఇన్నింగ్స్ చక్కదిద్దారు.

భారత బౌలర్లలో భువీ, ఆర్షదీప్ సింగ్, రవి బిష్ణోయ్, హార్దిక్ పాండ్యా, చాహల్ తలా ఒక వికెట్ పడగొట్టారు.

సూపర్ ఇన్నింగ్స్ ఆడిన మహమ్మద్ నవాజ్ కు కు ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’ దక్కింది.

Also Read Asia Cup-Super-4:  ఆఫ్ఘన్ పై లంక విజయం

RELATED ARTICLES

Most Popular

న్యూస్