న్యూజిలాండ్- పాకిస్తాన్- బంగ్లాదేశ్ మధ్య జరిగిన ముక్కోణపు టి20 సిరీస్ ను పాకిస్తాన్ గెల్చుకుంది. నేడు జరిగిన ఫైనల్లో ఆతిథ్య కివీస్ పై ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది.
క్రిస్ట్ చర్చ్ లోని హేగ్లీ ఓవల్ మైదానంలో జరిగిన మ్యాచ్ లో పాక్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. 12 పరుగులకు కివీస్ తొలి వికెట్ కోల్పోయింది. జట్టులో కెప్టెన్ విలియమ్సన్ 38 బంతుల్లో 4ఫోర్లు, 2 సిక్సర్లతో 59 పరుగులు చేసి రాణించాడు. గ్లెన్ ఫిలిప్స్-29; చాంప్ మన్-25 పరుగులు చేశారు. నిర్ణీత 20ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. పాక్ బౌలర్లలో నసీమ్ షా, హారిస్ రాఫ్ చెరో రెండు, షాదాబ్ ఖాన్, నవాజ్ చెరో వికెట్ పడగొట్టారు.
పాక్ 29 పరుగులకు తొలి వికెట్ (కెప్టెన్ బాబర్ ఆజామ్-15) కోల్పోయింది. రిజ్వాన్-34; షాన్ మసూద్ -19 పరుగులు చేశారు. ఇష్ సోదీ వేసిన ఇన్నింగ్స్ 15వ ఓవర్లో హైదర్ అలీ, మహమ్మద్ నవాజ్ లు 25 పరుగులు రాబట్టి జట్టును విజయానికి చేరువ చేశారు. హైదర అలీ 15 బంతుల్లో 3ఫోర్లు, 2సిక్సర్లతో 31 పరుగులు చేసి ఔట్ కాగా; నవాజ్ 22 బంతుల్లో 2ఫోర్లు, 3 సిక్సర్లతో 38 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. చివర్లో ఇఫ్తికార్ అహ్మద్ 14 బంతుల్లో ఒక ఫోర్, ఒక సిక్సర్ తో 25 పరుగుల మెరుపు ఇన్నింగ్స్ తో అజేయంగా నిలిచాడు.
మహమ్మద్ నవాజ్ ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’ గా, మైఖేల్ బ్రేస్ వెల్ ‘ప్లేయర్ అఫ్ ద సిరీస్’ గా ఎంపికయ్యారు.
Also Read : NZ Vs. WI: తొలి టి20లో కివీస్ విజయం