Saturday, November 23, 2024
Homeస్పోర్ట్స్ICC Men’s T20 World Cup 2022: సెమీస్ రేస్ లో నిలిచిన పాక్

ICC Men’s T20 World Cup 2022: సెమీస్ రేస్ లో నిలిచిన పాక్

పాకిస్తాన్ టి 20 వరల్డ్ కప్ సెమీ ఫైనల్ రేసులో నిలిచింది. నేడు జరిగిన మ్యాచ్ లో సౌతాఫ్రికాపై 33 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ కు కూడా వర్షం ఆటకం కలిగించింది. డక్ వర్త్ లూయూస్ (డిఎల్ఎస్) పధ్ధతి ప్రకారం సౌతాఫ్రికా లక్ష్యాన్ని 14 ఓవర్లకు 142గా నిర్ణయించారు. ఈ లక్ష్య ఛేదనలో ప్రోటీస్ జట్టు విఫలమైంది.

సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ లో జరిగిన ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. పాకిస్తాన్ 43 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. రిజ్వాన్-4; బాబర్ అజామ్-6; మసూద్-2; మొహమ్మద్ హారిస్-28 స్కోరు చేసి ఔటయ్యారు. షాదాబ్ ఖాన్ మెరుపు ఇన్నింగ్స్ ఆడి 22 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 52; ఇఫ్తికార్ అహ్మద్ 35 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 51 పరుగులు చేశారు. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 185 పరుగులు చేసింది.

సౌతాఫ్రికా బౌలర్లలో నార్త్జ్ నాలుగు; పార్నెల్, రబడ, నిగిడి, శంషి తలా ఒక వికెట్ పడగొట్టారు. ఫీల్డర్లు పలు క్యాచ్ లు వదిలేశారు, ఫీల్డింగ్ లో కూడా చాలా తప్పిదాలు చేశారు.

ఆ తర్వాత బ్యాటింగ్ మొదలు పెట్టిన సౌతాఫ్రికా వర్షంతో మ్యాచ్ ఆగిపోయే సమయానికి 4 వికెట్లకు (డికాక్ డకౌట్; రిలీ రోస్సో-7; కెప్టెన్ బావుమా-36; ఏడెన్ మార్ క్రమ్-20) 69 పరుగులు చేసింది. వర్షం తెరిపివ్వడంతో డిఎల్ఎస్  ప్రకారం 5 ఓవర్లలో 73 పరుగులు చేయాల్సి వచ్చింది. దీనితో ఓటమి తప్పలేదు 14  ఓవర్లలో 9 వికెట్లకు 108 పరుగులు చేసింది.

పాకిస్తాన్ బౌలర్లలో షాహీన్ ఆఫ్రిది మూడు; షాదాబ్ ఖాన్ రెండు; నషీమ్ షా, హారిస్ రాఫ్, మొహమ్మద్ వసీం జూనియర్ తలా ఒక వికెట్ పడగొట్టారు.

ఆల్ రౌండ్ ప్రతిభ చూపిన షాదాబ్ ఖాన్ కు ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్ దక్కింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్