Saturday, April 5, 2025
Homeస్పోర్ట్స్Abdullah Shafique: తొలి టెస్టులో పాకిస్తాన్ విజయం

Abdullah Shafique: తొలి టెస్టులో పాకిస్తాన్ విజయం

శ్రీలంకతో జరిగిన మొదటి టెస్ట్ లో పాకిస్తాన్ నాలుగు వికెట్లతో విజయం సాధించింది.  రెండో ఇన్నింగ్స్ లో పాక్ ఓపెనర్ అబ్దుల్లా షఫీక్ 160 పరుగులతో అజేయంగా నిలిచి జట్టు విజయంలో కీలక పాత్ర పోచించాడు. నిన్న నాలుగోరోజు 342 పరుగుల విజయ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన పాకిస్తాన్ ఆట ముగిసే సమయానికి 3 వికెట్లకు 222 పరుగులు చేసిన సంగతి తెలిసిందే.  నేడు మరో మూడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని సాధించింది.

గల్లెలోని ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో శ్రీలంక టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. రెండు మ్యాచ్ ల సిరీస్ ఆడేందుకు పాక్ జట్టు లంకలో పర్యటిస్తోంది. రెండో మ్యాచ్ కూడా ఇదే స్టేడియంలో జూలై 24నుంచి జరగనుంది.

స్కోరు వివరాలు:

శ్రీలంక మొదటి ఇన్నింగ్స్: 222 (చండీమల్-76; మహీష తీక్షణ-38; ఓ ఫెర్నాండో-35) పాక్ బౌలింగ్- షహీన్ అఫ్రీదీ-4; హసన్ అలీ-2; యాసిర్ షా-2 వికెట్లు

పాకిస్తాన్ మొదటి ఇన్నింగ్స్: 218 (కెప్టెన్ బాబర్ ఆజమ్-119) – శ్రీలంక బౌలింగ్: ప్రబాత్ జయసూర్య-5; మహీష తీక్షణ-2; మెండీస్-2 వికెట్లు

శ్రీలంక రెండో ఇన్నింగ్స్: 337 (చండీమల్-94; కుశాల్ మెండీస్-76; ఒషాడ ఫెర్నాండో- 64); పాక్ బౌలింగ్: నవాజ్- 5; యాసిర్ షా-3 వికెట్లు

పాకిస్తాన్ రెండో ఇన్నింగ్స్: 344 (అబ్దుల్లా షఫీక్-160; బాబర్ ఆజమ్ -55; మహమ్మద్ రిజ్వాన్-40); శ్రీలంక బౌలింగ్: ప్రబాత్ జయసూర్య-4 వికెట్లు

మ్యాన్ అఫ్ ద మ్యాచ్ : అబ్దుల్లా సిద్దిక్

RELATED ARTICLES

Most Popular

న్యూస్