Sunday, September 8, 2024
HomeTrending Newsబిర్జు మహారాజ్ కు ప్రముఖుల నివాళి

బిర్జు మహారాజ్ కు ప్రముఖుల నివాళి

Pandit Birju Maharaj Is No More :

ప్రఖ్యాత కథక్ నృత్యకారుడు పండిట్ బిర్జు మహారాజ్ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధానమంత్రి నరేంద్రమోడి  వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు,  సంగీతం, కళారంగ ప్రియులు విచారం వ్యక్తం చేశారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధి, కేంద్రమంత్రులు,  తదితరులు దేశం గొప్ప కళాకారున్ని కోల్పోయిందన్నారు.

ప్రపంచ ప్రఖ్యాత కథక్ నృత్యకారుడు, పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత పండిట్ బిర్జు మహారాజ్ కన్నుమూశారు. గుండెపోటుతో ఆయన మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆదివారం రాత్రి శ్వాస తీసుకోవడం కష్టంగా మారడంతో బిర్జు మహారాజ్ ను ఆసుపత్రికి తరలించామని, అప్పటికే మరణించాడని అతని మనవరాలు రాగిణి మహారాజ్ చెప్పారు. కథక్ డ్యాన్సర్‌గానే కాకుండా శాస్త్రీయ గాయకుడు, కవి, డ్రమ్మర్‌గా ఆయన రాణించారు. దేవదాస్, దేద్ ఇష్కియా, ఉమ్రావ్ జాన్, బాజీ రావ్ మస్తానీ వంటి అనేక బాలీవుడ్ చిత్రాలకు నృత్య దర్శకత్వం వహించారు బిర్జూ మహారాజ్. సత్యజిత్ రే చిత్రం ‘చెస్ కే ఖిలాడీ’కి సంగీతం అందించారు.

లక్నో ఘరానాకు చెందిన 83 ఏళ్ళ బిర్జూ మహారాజ్ 1938 ఫిబ్రవరి 4న జన్మించారు. ఆయన అసలు పేరు పండిట్ బ్రిజ్మోహన్ మిశ్రా. తొమ్మిదేళ్ల వయసులో తండ్రి చనిపోవడంతో కుటుంబ బాధ్యతను భుజస్కంధాలపై వేసుకున్న బిర్జూ మహారాజ్.. తన మామ దగ్గర కథక్ నృత్య శిక్షణ తీసుకొని జీవిత ప్రయాణాన్ని ప్రారంభించారు. మొదటిసారి ఆయన సోలోగా బెంగాల్‌లోని మన్మథ్ నాథ్ ఘోష్ ఉత్సవాల్లో ప్రదర్శన ఇచ్చారు. ఇక అప్పటి నుండి వెనక్కి తిరిగి చూడకుండా కెరీర్ కొనసాగించారు.

ఆయన కెరీర్‌లో పద్మ విభూషణ్ సహా పలు అవార్డులను స్వీకరించారు. సంగీత నాటక అకాడమీ అవార్డు, కాళిదాస్ సమ్మాన్, నృత్య చూడామణి, ఆంధ్రరత్న, నృత్య విలాస్, ఆదర్శ శిఖర్ సమ్మాన్, సోవియట్ ల్యాండ్ నెహ్రూ అవార్డు, శిరోమణి సమ్మాన్, రాజీవ్ గాంధీ శాంతి పురస్కారం ఇలా ఎన్నో అవార్డ్స్ బిర్జు మహారాజ్ సొంతమయ్యాయి. ‘విశ్వరూపం’ చిత్రంలో ఆయన నృత్యానికి 2012లో జాతీయ చలనచిత్ర పురస్కారం లభించింది. అలాగే 2016 సంవత్సరంలో బాజీరావ్ మస్తానీ రాసిన ‘మోహే రంగ్ దో లాల్’ పాటకు అందించిన కొరియోగ్రఫీకి ఫిలింఫేర్ అవార్డు లభించింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్