Tuesday, December 24, 2024
Homeసినిమాప‌వ‌న్ కోసం స్టోరీ రెడీ చేస్తున్నప‌ర‌శురామ్

ప‌వ‌న్ కోసం స్టోరీ రెడీ చేస్తున్నప‌ర‌శురామ్

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ కోసం.. సూప‌ర్ స్టార్ మ‌హేష్ డైరెక్ట‌ర్ ప‌వ‌ర్ ఫుల్ స్టోరీ రెడీ చేస్తున్నాడ‌ట‌. ఇంత‌కీ.. ఎవ‌రా మ‌హేష్ డైరెక్ట‌ర్ అంటారా..?  ప‌ర‌శురామ్. మ‌హేష్ బాబుతో ‘స‌ర్కారు వారి పాట‘ సినిమాను తెర‌కెక్కించాడు. స‌మ్మ‌ర్ లో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. మూవీ తర్వాత పరశురామ్ యంగ్ హీరో నాగ చైతన్యతో సినిమా చేయాల్సింది. నాగేశ్వరరావు అనే పేరుతో ఓ కథని ఫైనల్ చేశాడు కూడా.

అయితే.. మహేష్ కారణంగా తనతో చేయాల్సిన ప్రాజెక్ట్ ని పక్కన పెట్టడంతో చైతూ ఇప్పడు పరశురామ్ ని వెయిటింగ్ లో పెట్టి తమిళ దర్శకుడు వెంకట్ ప్రభుతో తెలుగు తమిళ భాషల్లో ద్వి భాషా చిత్రాన్ని చేస్తున్నారు. ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ఇటీవలే కర్ణాటకలోని మాండ్య సమీపంలో మొదలైంది. ఇదిలా వుంటే.. చైత‌న్య‌ వెంకట్ ప్రభుతో సినిమా చేస్తున్న నేపథ్యంలో ఈ సమయాన్ని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ కోసం పరశురామ్ కేటాయిస్తున్నాడట.

చాలా కాలంగా పవన్ క‌ళ్యాణ్‌ తో సినిమా చేయాలని ఎదురుచూస్తున్న పరశురామ్ తన కోసం టెర్రిఫిక్ స్క్రిప్ట్ ని రెడీ చేసే పనిలో వున్నాడట. పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తే.. ‘అత్తారింటికి దారేది’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ ని నిర్మించిన బీవీఎస్ ఎన్ ప్రసాద్ ఈ భారీ ప్రాజెక్ట్ ని నిర్మించే అవకాశం వుందని తెలుస్తోంది. ప్ర‌స్తుతం ప‌వ‌న్ బిజీగా ఉన్నారు. మ‌రి.. ప‌ర‌శురామ్ తో మూవీకి ఓకే చెబుతారో లేదో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్