గన్నవరంలో నిన్న జరిగిన సంఘటనకు సంబంధించి తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభిరాం కు 14 రోజుల రిమాండ్ విధిస్తూ గన్నవరం కోర్టు తీర్పు చెప్పింది. పట్టాభితో పాటు మరో పదిమందికి కూడా రిమాండ్ విధించింది. పట్టాభికి విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించాలని కోర్టు ఆదేశించింది. పట్టాభి మినహా మిగిలిన అందరినీ రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించనున్నారు. పట్టాభికి వైద్య పరీక్షలు నిర్వహించి ఆ నివేదికను తనకు సమర్పించాలని, అదే సమయంలో పట్టాభిని కూడా తన ఎదుట హాజరు పరచాలని న్యాయమూర్తి ఆదేశించినట్లు తెలిసింది.
కాగా, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు విజయవాడలో పట్టాభి నివాసానికి చేరుకొని ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు.
Also Read : బిసి అంశం పక్కదోవ పట్టించేందుకే గన్నవరం డ్రామా: సీదిరి