Sunday, January 19, 2025
HomeసినిమాPawan Kalyan: పవన్ మరో ప్రాజెక్ట్ కి ఓకే చెప్పారా..?

Pawan Kalyan: పవన్ మరో ప్రాజెక్ట్ కి ఓకే చెప్పారా..?

పవన్ కళ్యాణ్‌ రీ ఎంట్రీ తర్వాత ఆయన స్పీడు మామూలుగా లేదు. జెడ్ స్పీడుతో దూసుకెళుతున్నారు. గత కొంత కాలంగా స్లోగా ఉన్న పవన్.. ఇప్పుడు గేర్ మార్చారు. వరుసగా సినిమాలకు కొబ్బరి కాయలు కొట్టేస్తున్నారు. కొన్ని సినిమాలు సెట్స్ పై ఉండగానే.. కొత్త సినిమాలు ప్రారంభిస్తుండడం విశేషం. ‘హరి హర వీరమల్లు’ సినిమా సెట్స్ పై ఉంది. ‘వినోదయ సీతం’ సెట్స్ పై ఉంది. ఇటీవలే ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా సెట్స్ పైకి వచ్చింది. ఈ సినిమాతో పాటు సుజిత్ డైరెక్షన్ లో చేస్తున్న ‘ఓజీ’ మూవీ కూడా సెట్స్ పైకి వచ్చింది.

ఇన్ని సినిమాలు సెట్స్ పై ఉండగా ఇప్పుడు మరో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. అదే.. సుధీర్ వర్మతో పవన్ సినిమా. ఈ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ కథ అందిస్తున్నారని సమాచారం. ఈ సినిమాని సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మించనున్నారు. మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. ఇందులో పవన్ కళ్యాణ్‌ మేనల్లుడు, వైష్ణవ్ తేజ్ కూడా నటిస్తున్నాడట. త్రివిక్రమ్ ఇచ్చిన కథను సుధీర్ వర్మ డెవలప్ చేస్తున్నాడని… త్వరలోనే ఈ సినిమాని ప్రకటించనున్నారని తెలిసింది. సుధీర్ వర్మ తెరకెక్కించిన ‘రావణాసుర’ ప్లాప్ అవ్వడంతో ఈ ప్రాజెక్ట్ ఉంటుందా..? సుధీర్ వర్మకు ఛాన్స్ ఇస్తారా..? లేక వేరే డైరక్టర్ కి ఆ బాధ్యతలు అప్పగిస్తారా అంటే.. సుధీర్ వర్మకే ఆ ఛాన్స్ ఇవ్వనున్నారని తెలిసింది.

భీమ్లా నాయక్, వినోద సీతం చిత్రాలకు తెర వెనుక అంతా చూసుకుంది త్రివిక్రమ్ శ్రీనివాసే.. అలాగే ఈ చిత్రానికి కూడా త్రివిక్రమ్ శ్రీనివాసే అంతా సెట్ చేశారట. మూల కథతో పాటు సంభాషణలు కూడా ఆయనే అందించనున్నారని తెలిసింది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. అయితే.. ఇన్ని సినిమాలు సెట్స్ పై ఉండగా మరి ఈ సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వస్తుంది అంటే.. ప్రస్తుతానికి సస్పెన్స్ అని చెప్పచ్చు. ఈ మూవీ ఎన్నికల తర్వాతే విడుదల అయ్యే అవకాశం ఉందని సమాచారం.

RELATED ARTICLES

Most Popular

న్యూస్