Wednesday, February 26, 2025
Homeసినిమాఅలాంటి సినిమా కోసమే పవన్ ఫ్యాన్స్ వెయిటింగ్!

అలాంటి సినిమా కోసమే పవన్ ఫ్యాన్స్ వెయిటింగ్!

పవన్ నుంచి ఒక సినిమా వస్తుందంటే అభిమానులు చేసే హడావిడి ఒక రేంజ్ లో ఉంటుంది. అలాంటి పవన్ నుంచి ఆయన ఫ్యాన్స్ ఆయన మార్క్ సినిమానే కోరుకుంటూ ఉంటారు. మాస్ యాక్షన్ .. తన మార్క్ ఫైట్స్ .. డైలాగ్స్ ఉండాలని ఆశపడతారు. అలాగే ఆయన సినిమా కూడా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కావాలని కోరుకుంటూ ఉంటారు. కానీ ఈ మధ్య కాలంలో వారి ముచ్చట తీరే సందర్భమే రాలేదని చెప్పాలి.

త్రివిక్రమ్ తో ‘అజ్ఞాతవాసి’ చేసిన తరువాత, పవన్ నుంచి మళ్లీ ఆ తరహా సినిమా రాలేదనే అనాలి.  ఆ తరువాత పవన్ తన స్థాయికంటే .. తనకి గల మార్కెట్ కంటే చిన్న సినిమాలనే చేస్తూ వచ్చాడు. ఆ సినిమాలన్నీ కూడా రీమేక్ కేటగిరిలోనివి కావడం గమనించవలసిన విషయం. అయితే పవన్ కి గల క్రేజ్ కారణంగా ఆ సినిమాలకి కూడా ఒక పెద్దరికం వచ్చేసింది. భారీ స్థాయిలోనే అవి విజయాలను సాధించాయి. భీమ్లా నాయక్’ .. ‘వకీల్ సాబ్’ తరువాత పవన్ చేసిన ‘బ్రో’ కూడా ఇదే కేటగిరీలోకి వస్తుంది.

అయితే పవన్ అభిమానులు మాత్రం ఆయన నుంచి ఒక భారీ సినిమాను ఆశిస్తున్నారు. ఆయన కూడా అలాంటి ఒక సినిమా చేయాలనే ఉద్దేశంతోనే ‘హరి హర వీరమల్లు’ సినిమాను సెట్స్ పైకి తీసుకుని వెళ్లాడు. కానీ అనేక కారణాల వలన ఆ సినిమా విషయంలో జాప్యం జరుగుతూ వస్తోంది. ఈ సినిమాతో థియేటర్ల దాహం తీరుతుందని పవన్ అభిమానులు భావిస్తున్నారు. ఇక ఆ తరువాత కూడా హరీశ్ శంకర్ తో చేస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఫ్యాన్స్ కి ఉత్సాహాన్ని కలిగించే విషయం. ఆ సినిమాల కోసమే వాళ్లంతా వెయిట్ చేస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్