Sunday, January 19, 2025
Homeసినిమాసాయితేజ్ కోసం పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా..?

సాయితేజ్ కోసం పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా..?

పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ మూవీతో రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత వరుసగా సినిమాలు చేస్తున్నారు. సక్సెస్ సాధించిన ‘భీమ్లా నాయక్’ అంటూ మరో సక్సెస్ సాధించారు. ప్రస్తుతం క్రిష్ డైరెక్షన్ లో ‘హరి హర వీరమల్లు’ సినిమా చేస్తున్నారు. భారీ పాన్ ఇండియా మూవీగా రూపొందుతోన్న ఈ సినిమా గత కొంతకాలంగా షూటింగ్ జరుగుతూనే ఉంది. ఏఎం రత్నం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సమ్మర్ లో రిలీజ్ కావాల్సిన హరి హర వీరమల్లు చిత్రాన్ని దసరాకి వస్తుందని టాక్ వినిపిస్తోంది.

అయితే.. ఈ సినిమా షూటింగ్ పూర్తి కాకుండానే.. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ స్టార్ట్ చేశారు. అలాగే సుజిత్ డైరెక్షన్ లో ఓజీ మూవీ స్టార్ట్ చేశారు. ఇప్పుడు ‘వినోదయ సీతం’ రీమేక్ కూడా స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారట. ఇందులో పవన్ కళ్యాణ్ దేవుడు క్యారెక్టర్ చేయనున్నారు. మేనల్లుడు సాయిధరమ్ తేజ్ ఇందులో నటిస్తున్నాడు. ఈ సినిమా కోసం సాయిధరమ్ తేజ్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాడు. కొత్త సినిమాలు ఒప్పుకోకుండా ఈ సినిమా తర్వాతే కొత్త సినిమాకి ఓకే చెప్పాలని వెయిటింగ్ లో ఉన్నాడు. ఎట్టకేలకు ఈ మూవీకి పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

ఫిబ్రవరి 14 నుంచి తాను అందుబాటులో వుంటానని ఈ ప్రాజెక్ట్ కోసం 10 నుంచి 15 రోజులు కేటాయించనున్నట్టుగా వెల్లడించారట పవర్ స్టార్. ఈ సినిమాలో పవన్ క్యారెక్టర్ గోపాల గోపాల మూవీలో తరహాలో సాగనుంది. దీంతో తన పాత్ర నిడివి తక్కువే కాబట్టి 10 నుంచి 15 రోజుల్లో పూర్తి చేయాలని పవన్ ఫిక్స్ అయి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట. సముద్రఖని దర్శకత్వం వహించనున్న ఈ రీమేక్ కు త్రివిక్రమ్ మాటలు స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. మరి.. ఈ మూవీతో మేనమామ, మేనల్లుడు, పవర్ స్టార్, సాయితేజ్ కలిసి ఎంత వరకు మెప్పిస్తారో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్