Saturday, January 18, 2025
HomeసినిమాPawan Kalyan: నితిన్ మూవీలో పవర్ స్టార్..?

Pawan Kalyan: నితిన్ మూవీలో పవర్ స్టార్..?

నితిన్.. పవన్ కళ్యాణ్‌ వీరాభిమాని అనే విషయం అందరికీ తెలిసిందే. తన అభిమానాన్ని సమయం కుదిరినప్పుడల్లా తన సినిమాల్లోనూ చూపిస్తుంటాడు… వేదికల మీద చూపిస్తుంటాడు. ఇదిలా ఉంటే.. నితిన్ మూవీలో పవన్ కళ్యాణ్‌ నటించనున్నారు అనే వార్త బయటకు వచ్చింది. ఇంతకీ విషయం ఏంటంటే…నితిన్ హీరోగా వక్కంతం వంశీ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతుంది. ఈ సినిమాలో నితిన్ క్యారెక్ట‌ర్ విభిన్నంగా ఉండ‌బోతోందని తెలిసింది. ఇంతకీ ఏ క్యారెక్టర్ చేస్తున్నాడంటే… తాను ఓ జూనియ‌ర్ ఆర్టిస్టుగా క‌నిపించ‌బోతున్నాడట.

ఈ సినిమాలో ఓ సంద‌ర్భంలో ప‌వ‌న్ సినిమాలో.. నితిన్ కు జూనియ‌ర్ గా న‌టించే అవ‌కాశం వ‌స్తుంద‌ట. ఈ సన్నివేశలో తన అభిమాన కథానాయకుడు పవన్ కానీ, ఆయన రిఫెన్స్‌ని గానీ చూపించే అవ‌కాశం ఉంద‌ని స‌మాచారం. తెర‌ పై ఆయన క‌నిపిస్తాడో లేదో కానీ, సినిమాలో ప్ర‌స్తావన‌ మాత్రం త‌ప్ప‌కుండా ఉంటుందట. ఒక‌వేళ ప‌వ‌న్‌ని అతిథి పాత్ర కోసం తీసుకురావాల‌ని నితిన్ అనుకొన్నా.. అదేమంత క‌ష్టం కాదు. ఎందుకంటే.. ప‌వ‌న్ అంటే నితిన్‌కి ఎంత ఇష్టమో.. నితిన్ అన్నా ప‌వ‌న్‌కి కూడా అంతే ఇష్టం. నితిన్ అడిగితే.. ప‌వ‌న్ కాద‌న‌డు.

ఇందులో నితిన్ కు జంటగా శ్రీ‌లీల క‌థానాయిక‌గా న‌టిస్తుంది. ఇక ఈ చిత్రం కోసం జూనియ‌ర్‌, సైతాన్‌ అనే టైటిల్స్‌ ప‌రిశీలిస్తున్నారు. టైటిల్ ని త్వ‌ర‌లోనే అధికారికంగా ప్ర‌క‌టిస్తారు. ఇటీవల కాలంలో నితిన్ కాస్త వెనకబడ్డాడు. మళ్లీ ఫామ్ లోకి రావాలని ట్రై చేస్తున్నాడు. ఈ సినిమా విజయం కోసం.. అటు నితిన్, ఇటు వక్కంతం వంశీ ఇద్దరూ ఎంతో పట్టుదలతో వర్క్ చేస్తున్నారట. మరి.. ఈ మూవీతో నితిన్ మళ్లీ ఫామ్ లోకి వస్తాడేమో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్