Saturday, January 18, 2025
Homeసినిమా'గాడ్ ఫాద‌ర్' ఈవెంట్ కు ప‌వ‌న్ రావ‌డంలేదా?

‘గాడ్ ఫాద‌ర్’ ఈవెంట్ కు ప‌వ‌న్ రావ‌డంలేదా?

మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ మూవీ ‘గాడ్ ఫాదర్‘.  మోహ‌న‌రాజా దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ద‌స‌రా కానుక‌గా అక్టోబ‌ర్ 5న రిలీజ్ కానుంది.  ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురంలో నిర్వహిస్తున్నట్లు స‌మాచారం.

ఈ ఈవెంట్ కు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా వస్తారని చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. గాడ్ ఫాద‌ర్  పొలిటికల్ థ్రిల్లర్ కాబట్టి జనసేన అధినేత పవన్ సరైన గెస్ట్ అని అభిమానులు భావించారు. చాలా కాలం తర్వాత మెగా బ్రదర్స్ ఇద్దరినీ ఒకే వేదిక మీద చూసే అవకాశం కలుగుతుందనిఆశ పడ్డారు. అయితే  అభిమానుల‌కు నిరాశ తప్పదని తెలుస్తోంది.

పవన్ ప్రస్తుతం హైదరాబాద్ లో లేరు. విదేశీ పర్యటన కోసం అమెరికా వెళ్ళారు. దసరా తరువాతే అక్కడి నుంచి తిరిగి వస్తారని సమాచారం. దీంతో అన్నయ్య సినిమా ఫంక్షన్ కు త‌మ్ముడు పవన్ వచ్చే అవకాశం లేకుండా పోయింది. గాడ్ ఫాదర్ ఈవెంట్ కు పవన్ కళ్యాణ్ వచ్చే అవకాశం లేదు కాబట్టి.. నిర్మాతల్లో ఒకరిగా వ్యవహరించిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ని తీసుకొస్తే బాగుంటుందని ఫ్యాన్స్ అభిప్రాయ పడుతున్నారు. మ‌రి.. చ‌ర‌ణ్ గెస్ట్ గా వ‌స్తాడేమో చూడాలి.

Also Read : ‘గాడ్ ఫాదర్’ కు యూ/ఎ సర్టిఫికేట్

RELATED ARTICLES

Most Popular

న్యూస్