Sunday, January 19, 2025
HomeసినిమాDevude Digi Vachina: పవన్, తేజ్ మూవీ టైటిల్ ఇదేనా..?

Devude Digi Vachina: పవన్, తేజ్ మూవీ టైటిల్ ఇదేనా..?

పవన్ కళ్యాణ్‌, సాయిధరమ్ తేజ్ కలిసి వినోదయ సీతమ్ రీమేక్ చేస్తున్నారు. ఈ చిత్రానికి సముద్రఖని దర్శకత్వం వహిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. ఈ క్రేజీ మూవీకి త్రివిక్రమ్ శ్రీనివాస్ స్ర్కీన్ ప్లే – సంభాషణలు అందిస్తుండడం విశేషం. ఈ సినిమా ఎప్పటి నుంచో సెట్స్ పైకి వస్తుందని ప్రచారం జరిగింది. ఎట్టకేలకు ఆమధ్య సైలెంట్ గా షూటింగ్ స్టార్ట్ అయ్యింది. అంతే ఫాస్ట్ గా షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. ఒక పాట మాత్రం బ్యాలెన్స్ ఉందని సమాచారం.

త్వరలోనే మిగిలిన పాటనుకూడా పూర్తి చేయనున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నారు. సుజిత్ దర్శకత్వంలో  డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ నెలలోనే వినోదయ సీతం రీమేక్ లో మిగిలిన సాంగ్ ను కంప్లీట్ చేయనున్నారు. అయితే… ఈ చిత్రానికి ‘దేవుడు’ అనే టైటిల్ పెట్టనున్నారని గతంలో వార్తలు వచ్చాయి. ఆతర్వాత ‘దేవర’ అనే టైటిల్ ప్రచారంలోకి వచ్చింది. ఇప్పుడు మరో టైటిల్ ప్రచారంలోకి వచ్చింది. ఏంటా టైటిల్ అంటే.. ‘దేవుడే దిగి వచ్చినా’. ఈ టైటిల్ నే ఫిక్స్ చేయాలి అనుకుంటున్నారని టాక్ వినిపిస్తోంది.

దేవుడికీ, మనిషికీ మధ్య నడిచే కథ కావడంతో ఈ టైటిల్స్ వినిపిస్తున్నాయి. దేవర టైటిల్ క్యాచీగా ఉండగా.. కథానుసారం దేవుడే దిగి వచ్చినా అనే టైటిల్ వైపు చిత్ర యూనిట్ మొగ్గు చూపుతుందని అంటున్నారు.  ఈ రెండు టైటిల్స్ తో ఒక టైటిల్ ను ఫైనల్ చేశారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఆ ఒక్కటీ కూడా దేవుడే దిగి వచ్చినా టైటిల్ అని ప్రచారం జరుగుతుంది. ఈ టైటిల్ కు పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఈ చిత్రం ఈ జూలై 28న విడుదల కానుందని ప్రకటించారు. మేనమామ, మేనల్లుడు అయిన పవన్, తేజ్ కలిసి నటించిన ఈ మూవీ పై భారీగా క్రేజ్ ఉంది

RELATED ARTICLES

Most Popular

న్యూస్